30, జూన్ 2014, సోమవారం

దాదాభాయి నౌరోజీ (Dadabhai Naoroji)

దాదాభాయి నౌరోజీ
జననంసెప్టెంబరు 4,  1825
రంగంవ్యాపారవేత్త, రాజకీయనేత,
ప్రత్యేకతబ్రిటీష్ చట్టసభ సభ్యుడైన తొలి ఏషియన్
మరణంజూన్ 30, 1917
దాదాభాయ్ నౌరోజీ 4 సెప్టెంబరు 1825న నవసారిలో జన్మించారు. పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి మరియు తొలితరం రాజకీయ మరియు సామాజిక నాయకుడు. బరోడా మహారాజు శయాజీరావు గైక్వాడ్-3 కాలంలో సంస్థాన దివానుగా పనిచేశారు. ఈయన 1892 నుండి 1895 వరకు ఇంగ్లాండు చట్టసభ అయిన యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఈయన ఈ పదవి పొందిన మొదటి ఆసియా వ్యక్తి. "గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా"గా ప్రసిద్ధి చెందిన నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖ నేతలలో ఒకరు. ఈయన రాసిన పుస్తకం "పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్ తరలిస్తున్న నిధుల గురించి వివరించిన మొదటి పుస్తకం. ఈయన 30 జూన్ 1917న మరణించారు.

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా:
దాదాభాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగానే కాకుండా ఈ సంస్థ స్థాపనకు కారకులైన ఒకరుగా ఉన్నారు. 1886లో కలకత్త (నేటి కోల్‌కత)లో జరిగిన రెండో కాంగ్రెస్ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. 1893లో లాహోరులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి రెండోసారి అధ్యక్షత వహించారు. 1906లో జరిగిన కలకత్తా సమావేశానికి కూడా అధ్యక్షత వహించి మూడు సార్లు ఈ పదవి పొందిన తొలి నాయకుడిగా అవతరించారు.

డ్రెయిన్ (సంపద తరలింపు) సిద్ధాంతము:
భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండుకు తరలి వెళుతుదని భావించి ఆధారాలతో సహా పేర్కొని తన ప్రఖ్యాత "పావర్టీ ఇన్ ఇండియా" గ్రంథంలో దీని గురించి వివరించారు. దీనికి 6 కారకాలు కూడా పేర్కొన్నారు. దీనివల్ల భారతదేశానికి ఏటా 200-300 పౌండ్ల నష్టం నరుగుతుందని వివరించారు. జాతీయాదాయ అంచనాలు వివరించడంలో కూడా ఈయన ప్రసిద్ధి పొందారు.

రచనలు:
దాదాబాయి నౌరోజీ పలు గ్రంథాలు రచించారు. వాటిలో ముఖ్యమైనవి- The manners and customs of the Parsees, The European and Asiatic races, The wants and means of India, Poverty and Un-British Rule in India, The Parsee Religion.

విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, పార్శీ ప్రముఖులు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, భారత జాతీయోద్యమం, 1825లో జన్మించినవారు, 1917లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక