29, జూన్ 2014, ఆదివారం

కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah)

కొణిజేటి రోశయ్య
జననంజూలై 4, 1933
స్వస్థలంవేమూరు (గుంటూరు జిల్లా)
పదవులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నరు, పిసిసి అధ్యక్షుడు, 4 సార్లు ఎమ్మెల్సీ,
కొణిజేటి రోశయ్య జూలై 4, 1933న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తిచేసిన రోశయ్య 4 సార్లు విధానమండలికి, ఒకసారి విధానసభకు, మరోసారి లోకసభకు ఎన్నిక కావడమే కాకుండా పలు ముఖ్యమంత్రుల (అంజయ్య, కోట్ల, చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్సార్) మంత్రివర్గాలలో స్థానం పొంది 2009లో వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2011లో తమిళనాడు గవర్నరుగా పదవులు పొందినారు. 2007లో ఆంధ్రా విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు.

రాజకీయ ప్రస్థానం:
రోశయ్య కాంగ్రెస్ పార్టీ తరపున 1968లో తొలిసారి విధానమండలికి ఎన్నికై, 1974 మరియు 1980లలో కూడా శాసనమండలి సభ్యులయ్యారు. టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రిచెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాలలో పలు కీలక శాఖలు నిర్వర్తించారు. పిసిసి అధ్యక్షుడీగానూ పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబరు 24, 2010 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2014, జూన్ 28న కర్ణాటక గవర్నరుగా అదనపు బాధ్యతలు చేపట్టారు.


విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ మంత్రులు, నరసరావుపేట లోకసభ నియోజకవర్గం, 1933లో జన్మించినవారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, తమిళనాడు గవర్నర్లు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక