హిమాలయ పర్వతాల పశ్చిమ భాగంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులూ లోని ఎత్తయిన ప్రాంతంలో సహజ సంపదతో కూడియున్న 1171 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని 1984లో భారత ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. జివా, సైంజ్, తీర్థన్ నదుల పరీవాహక ప్రాంతంలోకి వచ్చే ఈ పార్క్ జూన్ 23, 2014న యునెస్కో వారసత్వ జాబితాలో ప్రవేశించింది. ఈ పార్క్ 1500 మీటర్లు నుంచి 6000 మీటర్ల ఎత్తును కలిగియుండి చల్లటి వాతావరణంతో రకరకాల మొక్కలు, చెట్లు, రంగురంగుల పుష్పాలతో చూడముచ్చటగా, పూర్తిగా ఎత్తయిన ప్రాంతంలో మంచుతో కూడికొని వెండికొండలా కనిపిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ నుంచి యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన వాటిలో ఈ పార్కు రెండవది. ఇదివరకు కల్కా-సిమ్లా రైల్వే ఈ జాబితాలో చేరియుంది. ఈ పార్కు 31°44′ ఉత్తర అక్షాంశ్ం, 77°33′ తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ పార్కులో 375 అరుదైన వృక్షాలతో పాటు పలు క్షీరదజాతులు, పక్షి జాతులు, సరీసృపాలు, ఉభయచరాలున్నాయి. పలు జలపాతాలు, హిమానీనదాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
(మరింత సమాచారంకై ఆంగ్ల వికీపీడియా చూడండి )
= = = = =
|
24, జూన్ 2014, మంగళవారం
గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ (Great Himalayan National Park)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి