18, జూన్ 2014, బుధవారం

ఇరాక్ (Iraq)

 ఇరాక్
ఖండంఆసియా
వైశాల్యం4,37,072 చకిమీ
జనాభా3.6 కోట్లు
చరిత్రలో మెసపొటామియగా పిలువబడి, ప్రాచీన పంచ చరిత్రలో ప్రముఖ నాగరికతగా వర్థిల్లిన ఇరాక్ పశ్చిమాసియాలో టర్కీ, ఇరాన్, కువైట్ దేశాల సరిహద్దులో ఉంది. 4,37,072 చకిమీ వైశాల్యంతో, 3.6 కోట్ల జనాభాతో ఉన్న ఈ దేశ రాజధాని బాగ్దాద్. టిగ్రిస్ మరియు యూఫ్రటిస్ నదులు ఏ దేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులు. ఈ దేశ అధికారభాష అరబిక్. 1932లో ఇరాక్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. చారిత్రాత్మకమైన బాబిలోనియా ప్రాంతం ప్రస్తుతం ఈ దేశంలోనే ఉంది. 1990లో ఇరాక్ కువైట్‌ను ఆక్రమించగా అమెరికా జోక్యం చేసుకొని కువైట్‌కు స్వేచ్ఛ ప్రసాదించింది. ఇరాక్‌లో 97% ప్రజలు ముస్లింలు. ఫుట్‌బాల్ ఈ దేశ ప్రజాదరణ కల క్రీడ.

భౌగోళికం, సరిహద్దులు:
పశ్చిమాసియాలో 29 నుంచి 38° ఉత్తర అక్షాంశం, 39 నుంచి 49° తూర్పు రేఖాంశంపై ఉన్న ఇరాక్‌కు తూర్పున ఇరాన్, ఉతరాన టర్కీ మరియు సిరియా, దక్షిణాన సౌదీ అరేబియా, పశ్చిమాన సిరియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశ వైశాల్యం 4,37,072 చకిమీ. వైశాల్యంలో ఇది ప్రపంచంలో 59వ స్థానంలో ఉంది.

చరిత్ర:
ప్రాచీన కాలంలోనే యూఫ్రటిస్ మరియు టిగ్రిస్ నదుల మధ్యన నాగరికతగా వర్థిల్లిన ప్రాంతముగా ఇరాక్ పేరుపొందింది. ఆ తర్వాత అకాడియన్, సుమేరియన్, అస్సీరియన్, బాబిలోనియన్ రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. తదనంతరం అకామెనిడ్, హెల్లినిస్టిక్, పార్థియన్, ససానిడ్, రోమన్, ఉమయ్యాద్, అబ్బాసిద్, మంగోల్, ఒట్టోమాన్‌ల పాలన, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ అజమాయిషిలో నానాజాతి సమితి నియంత్రణ కిందకు చేరి 1932లో స్వాతంత్ర్యం పొందింది. 1958లో విప్లవం ద్వారా ఖాసిం నియంత్రణలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత సద్దాం హుస్సేన్ పాలనలోకి వెళ్ళింది. 1979లో ఇరాన్‌తో యుద్ధం జరిగింది. 1990లో సద్దాం హుస్సేన్ కువైట్‌ను ఆక్రమించగా అమెరికా జోక్యం చేసుకొని కువైట్‌ను విడీపించింది. మళ్ళీ ఇటీవల ఇరాక్‌లో అంతర్యుద్ధం చెలరేగుతోంది.

నగరాలు:
ఇరాక్‌లో బాగ్దాద్ పెద్ద నగరము మరియు ఈ దేశ రాజధాని. ఆ తర్వాత మోసుల్, బస్రా, అర్బిల్, సులేమానియా, కిర్కుక్, ఫల్లూజా, కర్బాలా పెద్ద నగరాలు.

విభాగాలు: దేశాలు, ఆసియా ఖండం, ఇరాక్,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక