శివసేన మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ రాజకీయపార్టీ. దీనిని జూన్ 19, 1966న బాల్ థాకరే చేత ప్రారంభించారు. మహారాష్ట్రుల తరఫున ఉద్యమించి, "మహారాష్ట్ర మహరాష్ట్రీయులదే" అనే నినాదంతో ముందుకువచ్చి, భూమిపుత్ర సిద్ధాంతంతో ముడిపడిన ఈ ప్రాంతీయ పార్టీ మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఎన్డీఏలో భాగంగా ఉంటూ జాతీయ రాజకీయాలలో కూడా ప్రభావం చూపుతోంది. దీనికి ప్రస్తుతం బాల్ థాకరే కుమారుడు ఉద్ధవ్ థాకరే అధిపతి.
పార్టీ రాజకీయ ప్రస్థానం: ప్రారంభంలో శివసేన పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ ప్రారంభించిన 2 దశాబ్దాల తర్వాత మహారాష్ట్రలో 15 లోకసభ స్థానాలు పొంది తన ఉనికిని చాటుకుంది. 1999 లోకసభ ఎన్నికలలో కూడా 15 స్థానాలు పొందింది. 2004లో 12 స్థానాలు, 2009లో 11 స్థానాలు, 2014లో 18 స్థానాలు పొందింది. 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్రలో అధికారంలో కొనసాగింది. మనోహర్ జోషి మరియు నారాయణరాణే ఈ కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1999 నుంచి ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ముంబాయి నగరపాలక సంస్థలో కూడా ఈ పార్టీ అధికారంలోఉంది.
= = = = =
|
18, జూన్ 2014, బుధవారం
శివసేన (Shiv Sena)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి