10, జూన్ 2014, మంగళవారం

కరాచి (Karachi)

కరాచి
దేశంపాకిస్థాన్
అక్షాంశ, రేఖాంశాలు24°51′N 67°02′E
జనాభా2,35,00,000
పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం, ప్రధాన నౌకాశ్రయం మరియు సింధ్ రాష్ట్ర రాజధాని అయిన కరాచి దేశంలో నైరుతి వైపున అరేబియా సముద్ర తీరాన ఉంది. 2,35,00,000 జనాభా కలిగివున్న కరాచి నగరం దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందింది. ఇది ప్రపంచంలోని పెద్ద నగరాలలో ఒకటి. 24°51′ ఉత్తర అక్షాంశం, 67°02′ తూర్పు రేఖాంశంపై ఉన్న కరాచి పాకిస్థాన్ మొదటి రాజధానిగా పనిచేసింది.

చరిత్ర:
క్రీస్తు పూర్వమే కరాచి చరిత్రలో పేరు సంపాదించుకుంది. తన నౌకలు బాబిలోనియా వెళ్ళడానికి వీలుగా అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. క్రీ.శ.8వ శతాబ్దిలో మహమ్మదీయుల దాడి తర్వాతే ఇక్కడ గిరిజనులు కొలాచి పేరుతో గ్రామం స్థాపించుకున్నారు. అదే క్రమేణా పెరిగి పెద్దదై నగరంగా మారింది. 1839లో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు. 1876లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిల్లా ఈ నగరంలోనే జన్మించాడు. 1947 వరకు ఈ నగరం అవిభక్త భారతదేశంలో ఉండగా ఆగస్టు 14, 1947న కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌లో చేరింది.

ఆర్థికం:
కరాచి పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధానిగా పిలువబడుతుంది. ఇది దేశంలోనే పెద్ద నగరమే కాకుండా ఓడరేవు సౌకర్యం కూడా ఉండటంతో వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించింది. దేశ ఉత్పత్తి రంగంలో ఈ నగరం దాదాపు 30% వాటా కలిగియుంది. సిమెంటు, స్టీలు, వస్త్ర, భారీ యంత్రపరికరాల, రసాయన తదితర పరిశ్రమలు నగర పరిధిలో ఉన్నాయి. 

క్రీడలు:
కరాచిలో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. 1935లోనే కరాచిలోని నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించబడింది. ఇది పాకిస్తాన్‌లో రెండవ పెద్ద స్టేడియం. సచిన్ టెండుల్కర్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇక్కడే ఆడినాడు.

విభాగాలు: పాకిస్తాన్ నగరాలు, ప్రపంచ ప్రసిద్ధి నగరాలు, అరేబియా సముద్ర తీరాన ఉన్న నగరాలు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక