24, జూన్ 2014, మంగళవారం

మడగాస్కర్ (Madagascar)

మడగాస్కర్
ఖండంఆప్రికా
రాజధానిఆంటననారివో
జనాభా2.20 కోట్లు
అధికార బాషమలగాసి, ఫ్రెంచి
మడగాస్కర్ ఆప్రికా ఖండానికి ఆగ్నేయాన హిందూమహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. పూర్వం మలగాసి రిపబ్లిక్‌గా పిలువబడ్డ ఈ దేశ రాజధాని ఆంటననారివో. మడగాస్కర్ ద్వీపం ప్రపంచంలో 4వ పెద్ద ద్వీపం. ఈ ద్వీపమే కాకుండా ఈ దేశం పలు చిన్న ద్వీపాలకు కూడా కలిగియుంది. మలగాసి, ఫ్రెంచి ఈ దేశ అధికార భాషలు. 1960లో ఫ్రెంచి పాలన నుంచి ఇది స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ జనాభా సుమారు 2.20 కోట్లు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ దేశం 592,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలో 47వ పెద్ద దేశంగా ఉంది. 12°నుంచి 26° దక్షిణ అక్షాంశం మరియు 43° నుంచి 51° తూర్పు రేఖాంశంపై ఈ దేశం ఉపస్థితమై ఉంది. హిందూమహాసముద్రంలో ఉన్న ఈ దేశానికి సమీపంలో తూర్పువైపున మారిషస్ దేశం ఉంది. పశ్చిమాన ఉన్న ప్రధాన భూభాగదేశం మోజాంబిక్.

చరిత్ర:
88 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్ భారతదేశ భూభాగంతో కలిసియున్నట్లు భూభౌతిక శాస్త్రవేత్తలు నిరూపించారు. క్రీ.పూ.350-క్రీ.శ.550 మధ్యకాలంలో బోర్నియో ద్వీపం నుంచి ప్రజలు ఇక్కడికి వలస వచ్చినట్లు చరిత్రకారుల కథనం. 18వ శతాబ్దం వరకు ద్వీపంలోని పలు ప్రాంతాల్లో పలువురు పాలించారు. 19వ శతాబ్దిలో పాలన సమైక్యంచేసి మెరీనా పాలకులు పాలించారు. 1897లో రాజవంశం విచ్ఛిన్నమై పాలన ఫ్రెంచివారిచేతిలోకి వెళ్ళింది. జూన్ 26, 1960న ఫ్రెంచి నుంచి మడగాస్కర్ స్వాతంత్ర్యం పొందింది.

విభాగాలు: ప్రపంచ దేశాలు, ఆఫ్రికా దేశాలు, ద్వీపదేశాలు, హిందూ మహాసముద్రంలోని దేశాలు, 1960లో స్వాతంత్ర్యం పొందిన దేశాలు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక