మాలి ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక భూపరివేష్ఠిత దేశం. 1960లో ఫ్రాన్సు నుంచి స్వాతంత్ర్యం పొందిన మాలి 12,40,192 చకిమీ భూభాగంతో ప్రపంచంలో 24వ పెద్ద దేశంగా, 1.4 కోట్ల జనాభాతో 67వ అత్యధిక జనాభా కల దేశంగా ఉంది. ఈ దేశ రాజధాని బమాకో. దేశంలో 90% ప్రజలు ముస్లింలు. ఈ దేశ అధికార భాష ఫ్రెంచి. నైగర్ మరియు సెనెగల్ ఈ దేశంలో ప్రవహించే ముఖ్యనదులు. భౌగోళికం, సరిహద్దులు: పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న మాలి 10° నుంచి 25° ఉత్తర అక్షాంశం, 13° పశ్చిమ రేఖాంశం నుంచి 5° తూర్పు రేఖాంశం మధ్యన విస్తరించి ఉంది. గ్రీనిచ్ రేఖాంశం ఈ దేశం మీదుగా వెళ్ళుచున్నది. 12,40,192 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశం ప్రపంచంలో 24వ పెద్ద దేశం. ఈ దేశానికి ఉత్తరాన అల్జీరియా, తూర్పున నైగర్, దక్షిణాన బర్కినాఫాసో మరియు ఐవరీకోస్ట్, నైరుతిన గినియా, పశ్చిమాన సెనెగల్ మరియు మారిటానియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర
ఆర్థిక వ్యవస్థ: ప్రపంచంలో అతి పేద దేశాలలో ఒకటిగా ఈ దేశం ఉంది. 1992 నుంచి స్వల్పంగా అభివృద్ధి చెందుతున్ననూ ఇంకనూ వెనుకబడిన దేశాల జాబితాలోనే కొనసాగుతోంది. ప్రత్తిపంట ఈ దేశ ముఖ్య వ్యవసాయ పంట. ఇక్కడి పత్తి పొరుగుదేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ప్రధాన నదులలో చేపల పరిశ్రమ కూడా కొనసాగుతుంది. మతం: క్రీ.శ.11వ శతాబ్దంలో ఇస్లాం మతం ప్రవేశించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఈ మతం ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దేశంలో 90% మతస్థులు ఇస్లాంకు చెందినవారు కాగా 5% క్రిస్టియన్లు.
= = = = =
|
19, జూన్ 2014, గురువారం
మాలి (Mali)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి