21, సెప్టెంబర్ 2020, సోమవారం

ఐవరీకోస్ట్ (Ivory Coast)

ఖండం
ఆఫ్రికా
రాజధాని
యాముస్సోక్రో
స్వాతంత్ర్యం
1960 (ఆగస్టు 7)
వైశాల్యం
3.22 లక్షల చకిమీ
జనాభా
2.63 కోట్లు
కరెన్సీ
CFA ఫ్రాంక్
ప్రధాన క్రీడ
ఫుట్‌బాల్
ప్రధాన ఓడరేవు
అబిద్‌జన్
ఐవరీ కోస్ట్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశము. పశ్చిమాఫ్రికాలో అట్లాంటిక్ మహాసముద్రం తీరాన్ని కల్గిన ఈ దేశ రాజధాని యాముస్సోక్రో. కాని పరిపాలన అంతా అబిద్‌జాన్ నగరం నుంచి కొనసాగుతుంది. అబిద్‌జాన్ దేశంలో పెద్ద నగరం మరియు ఒకప్పటి రాజధాని. ఐవరీకోస్ట్ ఆగస్టు 7, 1960న ఫ్రాన్సు నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాత 2 సార్లు దేశంలో అంతర్యుద్ధం జరిగింది. 3.22 లక్షల చకిమీ వైశాల్యం మరియు 2.63 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం పశ్చిమ ఆఫ్రికాలో ఆర్థికంగా పెద్దదేశం. కరెన్సీ CFA ఫ్రాంక్, ప్రధాన క్రీడ ఫుట్‌బాల్.

భౌగోళికం:
ఐవరీకోస్ట్ పశ్చిమాఫ్రికాలో భూమధ్యరేఖకు కొద్దిగా ఎగువన ఉంది. దక్షిణ భాగంగా అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దు ఉండగా మిగితా 3 వైపులా లైబీరియా, గినియా, మాలి, బర్కినాఫాసో, ఘనా దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. దేశంలో అత్యధిక మతస్థులు ముస్లింలు (42%), క్రిస్టియన్లు రెండో స్థానంలో (33%) ఉన్నారు.

చరిత్ర:
క్రీ.శ.15వ శతాబ్ది నుంచి యూరప్ దేశస్థులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 18వ శతాబ్దిలో ఫ్రెంచి అధీనంలోకి వచ్చి 1960 వరకు కొనసాగింది. ఆగస్టు 7, 1960న ఫ్రాన్సు నుంచి ఐవరీకోస్ట్ స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాత ఒకసారి సైనిక తిరుగుబాటు, 2 సార్లు అంతర్యుద్ధం జరిగింది. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన బోయిగ్నీ 1993 వరకు దేశాన్ని పాలించాడు.

ఆర్థికం:
ఐవరీకోస్ట్ పశ్చిమాఫ్రికాలో బలమైన ఆర్థిక వ్యవస్థను కల్గియుంది. కాఫీ మరియు కోకో ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు మరియు ప్రధాన ఎగుమతులు. దక్షిణ సరిహద్దులో ఉన్న అబిడ్‌జన్ నగరం ప్రధాన రేవుగా ఉండుటచే సముద్రతీరం లేని ఇతర పశ్చిమాఫ్రికా దేశాలకు ఈ రేవుద్వారా ఎగుమతి దిగుమతులు జరుగుతాయి మరియు ఆర్థికంగా ఈ రేవు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అబిద్‌జన్ దేశ ఆర్థిక రాజధానిగా కూడా పిల్వబడుతుంది.

క్రీడలు:
ఐవరీకోస్ట్ లో జనాదరన కల్గిన క్రీడ ఫుట్‌బాల్. రగ్బీ మరియు బాస్కెట్‌బాల్ క్రీడలు కూడా అభివృద్ధి చెందాయి. 2013లో ఐవరీకోస్ట్ ఆఫ్రికన్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ సాధించింది. 1984లో ఆఫ్రికా దేశాల ఫుట్‌బాల్ క్రీడలను నిర్వహించింది. 1984 ఒలింపిక్స్‌లో 400 మీ పరుగులో ఈ దేశానికి చెందిన గాబ్రియేల్ టియాకో రజతపతకం సాధించాడు.
 
 
ఇవి కూడా చూడండి:
 
 
 


హోం
విభాగాలు: ప్రపంచదేశాలు, ఆఫ్రికాదేశాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక