22, జూన్ 2014, ఆదివారం

మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddha Prasad)

మండలి బుద్ధప్రసాద్
జననంమే 26, 1956
స్వస్థలంభావదేవరపల్లి (కృష్ణా జిల్లా)
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, శాసనసభ డిప్యూటి స్పీకర్,
నియోజకవర్గంఅవనిగడ్డ అ/ని,
మండలి బుద్ధప్రసాద్ మే 26, 1956న జన్మించారు. ఈయన నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామానికి చెందినవారు. 3 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
మాజీ మంత్రి కృష్ణారావు వారసునిగా 1994 శాసనసభ ఎన్నికల్లో తొలిసారి అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 2004లో రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో పని చేశారు. 2009లో టిడిపి అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య చేతిలో ఓటమి చెందారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ అవనిగడ్డ నుంచి పోటీచేసి మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జూన్ 20, 2014న విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 2019లో అవనిగడ్డ నుంచి తెదేపా తరఫున పోటీచేసి వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, నాగాయలంక మండలం, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, 11వ శాసనసభ సభ్యులు, 12వ వ శాసనసభ సభ్యులు, 14వ శాసనసభ సభ్యులు, 1956లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక