29, జూన్ 2014, ఆదివారం

పి.సి.మహలనోబిస్ (P.C.Mahalanobis)

పి.సి.మహలనోబిస్
జననంజూన్ 29, 1893
రంగంగణాంక శాస్త్రవేత్త
అవార్డులుపద్మవిభూషణ్
మరణంజూన్ 28, 1972
భారతదేశానికి చెందిన ప్రముఖ గణాంక శాస్త్రవేత్తగా పేరుగాంచిన ప్రశాంత చంద్ర మహలనోబిస్ జూన్ 29, 1893న కోల్‌కతలో జన్మించారు. గణాంకశాస్త్రంలో మహలనోబిస్ డిస్టన్స్, ప్రణాళికలలో మహలనోబిస్ నమూనా ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈయన భారత గణాంక సంస్థను స్థాపించి భారీపరిశ్రమల నమూనా సర్వేలకు మార్గదర్శుకులయ్యారు.  భారతదేశ ప్రణాళికలలో ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అవార్డు పొందినారు. 79 సంవత్సరాల వయస్సులో మహలనోబిస్ జూన్ 28, 1972న మరణించారు.

గణాంక శాస్త్రవేత్తగా:
అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్‌కతలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర అద్యాపకుడిగా ప్రవేశించారు. ప్రెసిడెన్సీ కళాశాల అద్యాపకుడిగా ఉన్నపుడే గణాంక శాస్త్రజ్ఝుడిగా రాణించారు. గణాంకశాస్త్రంలో చేసిన సేవలకు గుర్తింపుగా 1945లో మహలనోబిస్ లండన్ లోని రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంకకమీషన్ సభ్యుడిగా నియమించబడ్డారు.1949 లో కేంద్ర మంత్రివర్గపు గణాంకశాస్త్ర గౌరవ సలహాదారుడిగా నియమించబడ్డారు. దీనితో దేశానికి ఆర్థిక, గణాంక సేవలందించడానికి అతనికి అవకాశం లభించింది. 1950 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష ఉపన్యాసంలో జాతీయ ప్రణాళిక విధానం లో గణాంక శాస్త్రం అంతర్భాగం అని పేర్కొన్నారు.భారతీయ గణాంక సంస్థ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) స్థాపన లో ప్రముఖ పాత్ర వహించారు. స్థూల జాతీయోత్పత్తి మరియు సంబంధిత ఇతర అంశాలను అంచనా వేయడం ఈ సంస్థ బాధ్యత. జాతీయాదాయ కమిటీ చైర్మెన్‌గా మహలనోబిస్ జాతీయాదాయ లెక్కలకు ప్రాతిపదిక స్వరూపాన్ని రూపొందించారు. 1933 లో భారత గణాంక శాస్త్ర పత్రిక సాంఖ్యప్రచురణను మహలనోబిస్ ప్రారంభించారు. 1940 దశకంలో శాంపిల్ సర్వే మీద మహలనోబిస్ సాగించిన పరిశోధనల ఫలితంగా 1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపితమైంది.
పి.సి.మహలనోబిస్ జనరల్ నాలెడ్జి

ప్రణాళికా విధాన కర్తగా:
సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించారు. 1950లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించారు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డారు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం. ఇది మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందినది. వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినారు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించారు.

అవార్డులు:
1944 : ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారం
1945 : లండన్ లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం
1957 : అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుడిగా హోదా పొందాడు
1968 : భారత ప్రభుత్వము చే పద్మ విభూషణ్ పురస్కారం పొందినాడు.


విభాగాలు: గణాంక శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, పద్మవిభూషణ్ గ్రహీతలు, 1893లో జన్మించినవారు, 1972లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక