4, జూన్ 2014, బుధవారం

రోనాల్డ్ రీగన్ (Ronald Reagan)

రోనాల్డ్ రీగన్
జననంఫిబ్రవరి 6, 1911
పదవులుఅమెరికా అధ్యక్షుడు, కాలిఫోర్నియా గవర్నర్
పార్టీరిపబ్లికన్ పార్టీ
మరణంజూన్ 5, 2004
రాజకీయ నాయకుడు, నటుడుగా పేరుపొందిన రోనాల్డ్ రీగన్ ఇల్లినాయిస్ లోని టాంపికోలో ఫిబ్రవరి 6, 1911న జన్మించారు. 1967-75 కాలంలో కాలిఫోర్నియా గవర్నరుగా పనిచేశారు. 1981లో అమెరికాకు 40వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికై జిమ్మీ కార్టర్ నుంచి పదవి పొందారు. 1985లో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి 1989వరకు అగ్రరాజ్య అధిపరిగా కొనసాగినారు. అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో పెద్ద వయస్కుడిగా రీగన్ పేరుపొందారు. చివరి దశలో అల్జీమర్స్ వ్యాధికి గురైన్ జూన్ 5, 2004న రీగన్ మరణించారు.

బాల్యం, అభ్యసనం:
1911లో టాంపికోలో జన్మించిన రీగన్ డిక్సన్‌లో పెరిగి అక్కడీ యురేకా కళాశాలలో అభ్యసించి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా కొంతకాలం పనిచేసి 1937లో లాస్‌ఏంజిల్స్ పయనమై నటుడిగా రాణించారు. ఆ తర్వాత రాజకీయాలవైపు దృష్టిసారించి ప్రారంభంలో డెమొక్రాటిక్ పార్టీలో ఉండి 1962లో రిపబ్లిక పార్టీలో చేరారు.

రాజకీయ ప్రస్థానం:
1945లో డెమొక్రటిక్ ఫార్టీ ద్వారా రాజకీయప్రవేశం చేసిన రీగన్ 1948 అధ్యక్ష ఎన్నికల సమయంలో హారీ ట్రూమన్‌కు మద్దతుగా నిలిచారు. 1962లో రిపబ్లిక పార్టీలో చేరారు. 1965లో కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీచేస్తున్నట్లు ప్రకటించి 1966 ఎన్నికలలో శాన్‌ఫ్రాన్సిస్కో మేయరుగా ఉన్న జార్జి క్రిస్టోఫర్‌పై విజయం సాధించి కాలిఫోర్నిగా గవర్నర్ పదవి చేపట్టారు. 1976లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీచేయడానికి ప్రయత్నించిననూ రిపబ్లికన్ పార్టీ మద్దతు జాన్ ఫోర్డ్‌కే లభించింది. 1980 అధ్యక్ష ఎన్నికలలో జిమ్మీకార్టర్‌పై విజయం సాధించి 1981లో అమెరికాకు 40వ అధ్యక్షుడైనారు. 1984 అధ్యక్ష ఎన్నికలలో వాల్టర్ మాండలేపై గెలుపొంది రెండో పర్యాయం అమెరికా అధ్యక్షపదవిని పొందారు. 
రోనాల్డ్ రీగన్ జనరల్ నాలెడ్జివిభాగాలు: అమెరికా అధ్యక్షులు, దేశాధినేతలు, 1911లో జన్మించినవారు, 2004లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక