భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడైన అభినవ్ బింద్రా సెప్టెంబరు 28, 1982న డెహ్రాడూన్‌లో జన్మించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 2008లో ఒలింపిక్ పతకాన్ని సాధించి వ్యక్తిగత విభాగంలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2014 కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణాన్ని సాధించి వరసగా 4 కామన్‌వెల్త్ క్రీడలలో స్వర్ణాన్ని సాధించిన ఘనతను పొందాడు.
క్రీడాప్రస్థానం: 1998లోనే 15 ఏళ్ళ వయస్సులో కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్న అభివన్ బింద్రా 2002లో మాంచెస్టర్ కామన్వెల్త్‌లో ఒక స్వర్ణపతకాన్ని, మరో కాంస్యపతకాన్ని సాధించాడు. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్‌లో కూడా స్వర్ణపతకంతో పాటు రజత పతకాన్ని సాధించాడు. అదే ఏడాది జాగ్రెబ్‌లో జరిగిన ISSF ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో స్వర్ణాన్ని పొందినాడు. 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో స్వర్ణపతకాన్ని సాధించి ఒలింపిక్ క్రీడలలోవ్ యక్తిగత పోటీలలో బంగారు పతకాన్ని పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణాన్ని మరియు కాంస్యాన్ని సాధించగా, 2014 గ్లాస్గో ఒలింపిక్స్‌లో కూడా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు. అవార్డులు: అంతర్జాతీయ క్రీడలలో భారతదేశానికి పేరుసాధించిపెట్టిన బింద్రాకు 2000లో అర్జున అవార్డు, 2001లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 2009లో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. A Shot at History: My Obsessive Journey to Olympic Gold పేరుతో బింద్రా తన జీవితచరిత్రను రోహిత్‌బ్రిజ్‌నాథ్‌తో కలిసి ప్రచురించాడు.
= = = = =
|
26, జులై 2014, శనివారం
అభినవ్ బింద్రా (Abhinav Bindra)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి