జగ్జీవన్ రాం ఏప్రిల్ 5, 1908న బీహార్‌లోని చంద్వాలో జన్మించారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు. జూలై 6 1986న జగ్జీవన్ రాం మరణించారు. జగ్జీవన్ రాం కూతురు మీరాకుమార్ 15వ లోకసభ స్పీకరుగా వ్యవహరించారు.
బాల్యం: బాబూ జగ్జీవన్‌రామ్ బీహార్ రాష్ట్రంలో చాంద్వా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908, ఏప్రిల్ 5న దళిత కుటుంబంలో జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. రాజకీయాలు: జగ్జీవన్ రాం రాజకీయాలలో అంచలంచెలుగా ఎదిగారు. 27 ఏళ్ల వయసులోనే బీహార్ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా పలు కేబినెట్ హోదాల్లో అనేక పదవులు అలంకరించినారు. భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా కూడా పనిచేశారు. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్’గా పిలవబడ్డ జగ్జీవన్ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
6, జులై 2014, ఆదివారం
జగ్జీవన్ రాం (Jagjivan Ram)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Mahaneeyudu
రిప్లయితొలగించండి