11, జులై 2014, శుక్రవారం

పానగల్లు (Panagal)

 పానగల్లు
మండలమునల్గొండ
జిల్లా నల్గొండ
జనాభా1157 (2001)
దర్శనీయ ప్రదేశాలుఛాయా సోమేశ్వరాలయం
పానగల్లు నల్గొండ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము. ఇది తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకమైన గ్రామము. ఇచ్చట 10 వ శతాబ్దికి చెందిన పురాతనమైన సోమేశ్వరాలయం ఉంది. ఇది కాకుండా అనేక ప్రాచీన ఆలయాలకు ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవాది, విప్లవకారుడు మరియు మానవతావాది అయిన కాంచనపల్లి చినరామారావు ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ గ్రామం 17.07°ఉత్తర అక్షాంశం, 79.2° తూర్పు రేఖాంశంపై ఉంది. గ్రామ పిన్ కోడ్ నం. 508 001.


జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1157. ఇందులో పురుషులు 586, మహిళలు 571. గృహాల సంఖ్య 254.

ఛాయా సోమేశ్వరాలయం:
సుమారు వెయ్యేళ్ళ క్రితం కందూరు చోళులు పానగల్లును రాజధానిగా చేసుకొని పాలమూరు, నల్గొండ జిల్లా ప్రాంతలను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాకతీయుల కాలంలో కూడా ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు ప్రతాపరుద్రుని శాసనాలు తెలియజేస్తున్నాయి. దేవాలయం గర్భగుడిలో గోడపై స్థిరంగా ఉండే నీడ ఈ దేవాలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ నీడ (ఛాయా) వలనే ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయం అని పేరువచ్చింది.

విభాగాలు: నల్గొండ మండలములోని గ్రామాలు, 


 = = = = =
(ఈ వ్యాసంలో ఉపయోగించిన ఛాయా సోమేశ్వరాలయం ఫోటో శ్రీ పాండురంగారావు గారి సౌజన్యంతో)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక