కామెరూన్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశము. ఇది పశ్చిమ మధ్య ఆఫ్రికాలో అట్లాంటిక్ మహాసముద్రం తీరాన ఉంది. ఫ్రెంచి, ఇంగ్లీష్ అధికార భాషలు కలిగిన ఈ దేశం మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ అధీనంలో ఉండేది. 1960లో ఫ్రెంచి పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఆఫ్రికా ఖండం సూక్ష్మచిత్రంగా ఈ దేశం ప్రసిద్ధి చెందింది. ఫుట్‌బాల్ క్రీడ ఇక్కడి జనాదరణ కలిగిన క్రీడ. పశ్చిమాఫ్రికాలోనే ఎత్తయిన కామెరూన్ పర్వతం ఈ దేశంలోనే ఉంది. డౌలా ఈ దేశంలోని పెద్ద నగరం. కామెరూన్ రాజధాని యాండే.
భౌగోళికం, సరిహద్దులు: కామెరూన్‌కు పశ్చిమాన నైజీరియా, ఈశాన్యాన చాద్, తూర్పున సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణాన ఈక్వటోరియల్ గినియా, గాబన్, కాంగో దేశాలు, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రంలో భాగమైన గినియా అఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. 475,442 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ దేశం ప్రపంచంలో 54వ స్థానంలో ఉంది. చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రాంతం జర్మనీ అధీనంలో ఉండగా, ఆతర్వాత ఫ్రెంచి, బ్రిటన్‌ల పాలనలో చెరిసగ భాగం ఉండింది. 1960లో ఫ్రెంచి పాలన నుంచి, 1961లో బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. జనాభా: 2013 అంచనా ప్రకారం దేశ జనాభా 2.25 కోట్లు. జనసాంద్రత కేవలం 40/చకిమీ మాత్రమే ఉంది.
= = = = =
|
11, జులై 2014, శుక్రవారం
కామెరూన్ (Cameroon)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి