24, ఆగస్టు 2014, ఆదివారం

చెన్నై (Chennai)

చెన్నై 
రాష్ట్రముతమిళనాడు
జనాభా89,17,749
స్థాపన1639
చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. బంగాళాఖాతము తీరాన ఉన్న చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ప్రపంచములోనే 34వ పెద్ద మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉన్నది. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మెబైల్) పరిశ్రమలు చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నందున ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని కూడ పిలుస్తారు. ఈ నగరము బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది, దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరములో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలే కాకుండా, ఏటా ఏటిపి స్థాయి చెన్నై ఓపెన్ టెన్నిస్ పోటీలు నిర్వహించబడతాయి. గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉన్నది. 2011 లెక్కల ప్రకారం చెన్నై నగర జనాభా 89,17,749.

నగర నామం:
దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు. 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియాని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. 1996 ఆగస్టులో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.

చెన్నై హైకోర్టు
చరిత్ర:
ఇప్పుడు చెన్నై నగరములో ఒక ప్రాంతమైన మైలాపూరు పల్లవుల కాలంలో ఒక ప్రముఖ నౌకాశ్రయముగా ఉండేది. 1522 సంవత్సరములో పోర్చుగీసు వారు ఇక్కడకు వచ్చారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. 1612లో డచ్ వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా పులికాట్ లో ఏర్పాటు చేసుకొన్నారు. 1639 ఆగస్టు 22న బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. ఆ తర్వాత బ్రిటీష్ వారు సెయింట్ జార్జి కోటను నిర్మించుకొన్నారు. కొంతకాలానికే ఈ ప్రాంతమంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. 1746 సంవత్సరములో సెయింట్ జార్జి కోటను ఫ్రెంచి వారు ఆక్రమించుకోగా, 1749లో మళ్లీ ఆంగ్లేయులు ఈ ప్రదేశము మీద తమ పెత్తనాన్ని ఐక్స్ లా చాఫెల్ సంధితో సంపాదించుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి తమిళనాడులోని చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు. మద్రాసు రాష్ట్రం పేరును 1969లో తమిళనాడు గా మార్చారు.

దక్షిణ రైల్వే కేంద్రస్థానం
రవాణా వ్యవస్థ:
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశం నలుమూలల ప్రముఖ నగరాలను కలపడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు కలకత్తా, బెంగుళూరు, తిరుచినాపల్లి, తిరువళ్ళూరు మరియు పుదుచ్చేరికి బయలు దేరుతాయి. చెన్నై ముఫసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. దక్షిణరైల్వే జోన్ కేంద్రస్థానం చైన్నె నగరంలో ఉంది.

యం.ఏ.చిదంబరం స్టేడియం
క్రీడలు:
క్రికెట్ చెన్నై నగరపు ప్రజాదరణ కలిగిన క్రీడ. భారతదేశములో అత్యంత ప్రాచీనమైన క్రికెట్ స్టేడియాలలో మద్రాసు చేపాక్ స్టేడియం ఒకటి. చేపాక్ స్టేడియం పేరు ఇప్పుడు యం.ఏ.చిదంబరం స్టేడియంగా మార్చబడింది. ఈ క్రీడాప్రాంగణంలో 1951-52 భారతదేశ మెదటి టెస్టు మ్యాచ్ విజయం (ఇంగ్లాండు తో), 1986 ఇండియా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ టై తో సహా, అనేక రికార్డులు నెలకొల్పబడ్డాయి.
చెన్నై నగరములో క్రికెట్టు తరువాత ప్రముఖ క్రీడ టెన్నిస్. దేశంలో నిర్వహించబడే ఏకైక ఏటిపి టెన్నిస్ టోర్నీ చెన్నై ఓపెన్ ఇక్కడే ఏటా జరుగుతుంది. భారతీయ టెన్నిస్ క్రీడాకారులలో ప్రముఖులైన విజయ అమృతరాజ్, రామనాథన్ కృష్ణన్, రమేష్ కృష్ణన్, మహేష్ భూపతి చెన్నైకు క్రీడాకారులు. 

విభాగాలు: భారతదేశ నగరాలు, తమిళనాడు నగరాలు, ప్రపంచ ప్రసిద్ధి నగరాలు, తమిళనాడు, చెన్నై,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక