1, సెప్టెంబర్ 2014, సోమవారం

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (Ernest Rutherford)

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్
జననం30 ఆగస్టు, 1871
దేశంన్యూజీలాండ్
రంగంరసాయన శాస్త్రవేత్త
మరణం19 అక్టోబరు, 1937
న్యూజీలాండ్‌కు చెందిన ప్రముఖ శాస్తవేత్త అయిన ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ 30 ఆగస్టు, 1871న జన్మించాడు. అణు భౌతిక శాస్త్ర పితామహుడుగా పరిగణించే రూథర్‌ఫోర్డ్ అణువులలో శక్తితో కూడిన కేంద్రకం ఉంటుందని కనిపెట్టాడు. అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదాగ్రహ మండల నమూనా)ను ప్రతిపాదించాడు. ఇతడు రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగంచేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రూథర్‌ఫోర్డ్ 19 అక్టోబరు, 1937న మరణించాడు.

పరిశోధనలు:
రూథర్‌ఫోర్డ్ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్న దశలోనే అత్యంత వేగంగా ప్రయాణించే విద్యుదయస్కాంత తరంగాలను కనిపెట్టినాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడాలోని మెగిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం రేడియో డేటింగ్ పద్ధతి ద్వారా భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్‌ అందుకున్నాడు.

కేంద్రక ఆవిష్కరణ:
కెనడా నుంచి ఇంగ్లండ్‌ తిరిగి వచ్చిన తర్వాత పలుచటి బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫాకిరణాలను ప్రసరింపజేసినప్పుడు 20000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు. అందుకు కారణం పరమాణువులో ధనావేశమున్న కేంద్రకం ఉండుటవలన అని నిరూపించాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనాగా పేరొందింది. దీనినే గ్రహమండల నమూనా అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్‌ బహుమతులు సాధించడం విశేషం. అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్‌ఫోర్డియం అని పేరు పెట్టారు.


విభాగాలు: శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, 1871లో జన్మించినవారు, 1937లో మరణించినవారు, న్యూజీలాండ్ ప్రముఖులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక