16, సెప్టెంబర్ 2014, మంగళవారం

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya)

మోక్షగుండం విశ్వేశ్వరయ్య
జననంసెప్టెంబర్ 15, 1861
జన్మస్థానంముద్దెనహళ్ళి
రంగంఇంజనీయరు
అవార్డులుభారతరత్న (1955)
మరణంఏప్రిల్ 14, 1962
భారతదేశపు ప్రముఖ ఇంజనీయరుగా ప్రసిద్ధి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్ళి గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. చిక్కబళ్ళాపూరు లో ప్రాధమిక విద్య, బెంగుళూరు లో ఉన్నతవిద్య పూర్తి చేసి, 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పూనె సైన్సు కాలేజి నుండి సివిల్ ఇంజనీరింగు ఉత్తీర్ణుడయ్యారు. ఇంజనీయరుగా పలు భారీ ప్రణాళికలకు రూపకల్పన చేసి పలు సంస్థానాల పాలకులచే మరియు ప్రజలచే మన్ననలు పొందారు. ఈయన సేవలకు గాను 1955లో భారత ప్రభుత్వం అత్యుత్తమమైన భారతరత్న అవార్డును ప్రధానం చేసింది. 1962 ఏప్రిల్ 14న విశ్వేశ్వరయ్య మరణించారు.

ఇంజనీయరు ప్రస్థానం:
బొంబాయి ప్రజా పనుల శాఖలో చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషను చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. ఆయన దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను, ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఆయన రూపొందించారు. 1903 లో మొదటిసారిగా దీనిని పూనె సమీపంలోని ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. దీని తరువాత గ్వాలియర్ సమీపంలోని అలతిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు.

హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. 1908లో స్వఛ్చంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసారు. 1917 లో బెంగుళూరు లో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటకలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది. మైసూరు దివానుగా ఉండగా ఆయనకు బ్రిటిషు ప్రభుత్వము నైట్‌హుడ్ (సర్) బిరుదు ప్రధానం చేసింది. 1955 లో భారత దేశపు అత్యంత గొప్ప పురస్కారం భారతరత్న ప్రధానం చేయబడింది. కర్ణాటక లోని ఇంజనీరింగు కాలేజీలన్నీ అనుబంధంగా ఉండే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట నెలకొల్పారు. ఆయన జన్మశతి సంవత్సరంలొ బెంగుళూరు లో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది.


విభాగాలు: భారతదేశ ప్రముఖులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, కర్ణాటక ప్రముఖులు, 1861లో జన్మించినవారు, 1962లో మరణించినవారు, 


 = = = = =



Tags;Mokshagundam Visvesvaraya in Telugu, Mokshagundam Visvesvaraiah essay in Telugu,

2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక