22, అక్టోబర్ 2014, బుధవారం

మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)

 మనోహర్ లాల్ ఖట్టర్
జననంమే 5, 1954
రంగంరాజకీయాలు
రాష్ట్రంహర్యానా
పదవులుముఖ్యమంత్రి (ప్రతిపాదిత)
మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు. 1954లో జన్మించిన ఖట్టర్ ప్రారంభంలో ఆరెస్సెస్‌లో ప్రవేశించి ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోప్రవేశించారు. 2014 హర్యానా శాసనసభకు ఎన్నికై ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించనున్నారు.

ప్రారంభ జీవనం:
మనోహర్ లాల్ ఖట్టర్ మే 5, 1954న హర్యానాలోని రోహ్‌టక్ జిల్లా నిందన గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చింది. రోహ్‌టక్ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన మనోహర్ ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి దుకాణం నిర్వహిస్తూనే డీగ్రీ పూర్తిచేశారు. 1977లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ప్రవేశించి పూర్తికాలం ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించారు.

రాజకీయ ప్రస్థానం:
2000-2014 కాలంలో ఖట్టర్ హర్యానాలో భాజపా సంస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో భాజపా ఎన్నికల యంత్రాంగం చైర్మెన్‌గా ఉంటూ పార్టీకి విజయాలు అందించారు. ఆ తర్వాత భాజపా జాతీయ ఎక్జిక్యూటిబ్ కమిటి సభ్యులయ్యారు. 2014లో ఖట్టర్ కార్లన్ నుంచి శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్రంలో భాజపాకు మెజారిటి స్థానాలు లభించడంతో ఖట్టర్ 2014, అక్టోబరు 25 హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

విభాగాలు: హర్యానా ముఖ్యమంత్రులు, 1954లో జన్మించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక