29, నవంబర్ 2014, శనివారం

హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (Harindranath Chattopadhyay)

 హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
జననంఏప్రిల్ 2, 1898
రంగంకవి, నటుడు,
అవార్డులుపద్మభూషణ్
మరణంజూన్ 23, 1990
కవిగా, నటుడిగా పేరుపొందిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఏప్రిల్ 2, 1898న హైదరాబాదులో అఘోరనాథ చటోపాధ్యాయ, వరదాసుందరి దేవి దంపతులకు జన్మించారు. కవికోకిల సరోజినీ నాయుడు సోదరుడైన హరీంద్రనాథ్చిన్న వయస్సులోనే దేశభక్తిగేయాలు రచించారు. సాహిత్యంలో పీహెచ్‌డి చేయాలని కేంబ్రిడ్జి వెళ్ళి మహాత్మాగాంధీ పిలుపుతో స్వదేశానికి తిరిగివచ్చి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. హరోన్ రాసిన "సూర్ అస్త్ హోగయా గగన్ మస్త్ హోగయా" పాట 18 భాషలలోకి అనువాదితమైంది. బ్రిటీష్ ప్రభుత్వం ఈయన పాటలకు జడిసి అరెస్ట్ చేసి జైలుకు పంపించింది.

దేశ స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి లోకసభ ఎన్నికలలో విజయవాడ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1960, 70, దశకాలలో హరీన్ పలు సినిమాలలో నటించారు. అదే సమయంలో పలు నాటకాలు రచించారు. భారత ప్రభుత్వం ఈయన సేవలను గుర్తించి పద్మభూషన్ ప్రధానం చేసింది. 1952లో గుంటూరు హిందూ కాలేజీలో, 1981లో రవీంధ్రభారతిలో హరీష్‌ను ఘనంగా సన్మానించారు. 1990 జూన్ 23న ముంబాయిలో హరీంద్రనాథ్ మరణించారు.


విభాగాలు: హైదరాబాదు రచయితలు, హైదరాబాదు ప్రముఖులు, 1898లో జన్మించినవారు, 1990లో మరణించినవారు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక