28, నవంబర్ 2014, శుక్రవారం

కుందూ నది (Kundu River)

కుందూ నది
ప్రధాననదిపెన్నానది
పరీవాహక జిల్లాలుకడప, కర్నూలు,
కుందూ లేదా కుందేరు నది  (కుముద్వతి అని కూడా పిలుస్తారు) కర్నూలు జిల్లాలో ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి కడప జిల్లా కమలాపురం సమీపములో పెన్నానదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైనది. నది పరివాహక పరిధిలో కర్నూలు జిల్లలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు మరియు చాగలమర్రి, కడప జిల్లాలోని మైదుకూరు మండలాలు ఉన్నాయి. కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి మరియు వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు మరియు మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతము నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది. నంద్యాల వద్ద కర్నూలు - కంభం రహదారిపై కుందూనదికి 1864లో ఒక వంతెన నిర్మించారు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ నదులు, కర్నూలు జిల్లా నదులు, కడప జిల్లా నదులు, పెన్నానది, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక