ప్రముఖ నవలా రచయిత్రిగా పేరుపొందిన మాదిరెడ్డి సులోచన 1935లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జన్మించారు. హైదరాబాదులోని బి.వి.ఆర్.రెడ్డి మహిళాకళాశాల బి.ఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., ఎం.యిడి. పట్టాలుపొంది ప్రారంభంలో సుమారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. భర్తతో బాటు ఇథియోపియా, జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయినిగా పనిచేసింది. ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ వల్ల ప్రేరేపితులైన సులోచన 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో నవల రచనతో ప్రస్థానం ప్రారంభించి దాదాపు 150 కధలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రచించింది. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. సులోచన తెలంగాణ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన రచనలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కధా రచయిత్రి అవార్డులు కూడా పొందింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో 1984లో ఈమె మరణించింది. ఈమె గౌరవార్థం "మాదిరెడ్డి సులోచన స్మారక అవార్డులు" ప్రధానం చేయబడుతున్నాయి.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
12, నవంబర్ 2014, బుధవారం
మాదిరెడ్డి సులోచన (Madireddy Sulochana)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి