8, నవంబర్ 2014, శనివారం

సుజనా చౌదరి (Sujana Chowdary)

సుజనా చౌదరి
జననంజూన్ 2, 1961
స్వస్థలంకంచికచర్ల
రంగంపారిశ్రామికవేత్త మరియు రాజకీయాలు
పదవులురాజ్యసభ సభ్యుడు,
సుజనా చౌదరిగా ప్రసిద్ధి చెందిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయ నాయకుడు. కృష్ణా జిల్లా కంచికచర్లలో జూన్ 2, 1961న జన్మించిన సుజనా చౌదరి సుజనాగ్రూప్ కంపెనీల స్థాపకుడు. 2010లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై, 2014 నవంబరు 9న నరేంద్రమోడి నాయకత్వంలోని కేంద్రమంత్రిమండలిలో స్థానం పొందారు.

బాల్యం, విద్యాభ్యాసం:
జూన్ 2, 1961న కంచికచర్లలో జన్మించిన సుజనా చౌదరి బాల్యంలో అధికంగా విజయవాడ, మిర్యాలగూడ, హైదరాబాదులలో గడిపారు. ఇతని తాత ఐపీఎస్ అధికారిగా, తండ్రి ఇరిగేషన్ శాఖలో ఎస్.ఈ.గా పనిచేశారు. 1984లో చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది 1986లో సుజనా గ్రూప్ కంపెనీలను ప్రారంభించారు.

పారిశ్రామికవేత్తగా:
1986లో సుజనా గ్రూప్ కంపెనీలు స్థాపించి పద్మిని పేరుతో ఫ్యానులు, గృహోపకరణాల తయారీని ప్రారంభించారు. సుజన అనేది ఇతని తల్లిదండ్రుల (సుశీల, జనార్థన్ రావు) పేర్లలోని అక్షరాలు. 1988లో పరిశ్రమను విస్తరించి ఉక్కు రంగంలో కూడా ప్రవేశించారు. సుజనా చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం:
2010లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనారు. 2014, నవంబరు 8న నరేంద్రమోడి మంత్రివర్గంలో శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ మంత్రిగా నియమితులైనారు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు, కృష్ణా జిల్లా ప్రముఖులు, 1961లో జన్మించినవారు, కంచికచర్ల మండలం,


 = = = = =


Yalamanchili Satyanarayana Chowdary, Y.S.Chowdary,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక