4, డిసెంబర్ 2014, గురువారం

తోడిశెట్టి రాములు (Todishetti Ramulu)

 తోడిశెట్టి రాములు
జననంఅక్టోబరు 25, 1950
స్వగ్రామంవెంగ్యాపేట్ (ఆదిలాబాదు జిల్లా)
రంగంసాహితీవేత్త
ప్రముఖ సాహితీవేత్త తోడిశెట్టి రాములు అక్టోబరు 25, 1950న ఆదిలాబాదు జిల్లా నిర్మల్ మండలం వెంగ్యాపేట్ గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.(తెలుగు) పట్టా పొంది ఉపాధ్యాయులుగా పనిచేసి 2008 జూన్‌లో పదవీ విరమణ చేశారు. పలు గ్రంథాలు రచించి సాహితీవేత్తగా పేరుపొందారు. 2014 నవంబరులో సుందరకాండము, శ్రీ సీతారామ చరితము పద్య కావ్యాలను విడుదల చేశారు.

విద్య మరియు ఉద్యోగ ప్రస్థానం:
స్వగ్రామం వెంగ్యాపేట్‌లోనే ప్రాథమిక విద్య పూర్తిచేసిన రాములు హైస్కూలు విద్య నిర్మల్‌లో, బి.ఏ. మరియు ఎం.ఏ.(తెలుగు) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేశారు. ఆదిలాబాదులో అధ్యాపక శిక్షణ పొంది ప్రారంభంలో నిర్మల్‌లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఆచార్య వృత్తి స్వీకరించి 1970 నుంచి 1976 వరకు పనిచేశారు. ఆ తర్వాత ప్రభుతోన్నత పాఠశాల ఆదిలాబాదులో 1984 వరకు, 1984-90 కాలంలో కస్బా నిర్మల్‌లో, 1990-2002 కాలంలో ఆదిలాబాదు ఉన్నత పాఠశాలలో పనిచేశారు. 2002లో జడ్పీ పాఠశాల జైనాథ్‌లో చేరి 2008 జూన్‌లో పదవీ విరమణ వరకు అక్కడే పనిచేశారు.

సాహితీ ప్రస్థానం:
సాహితీవేత్తగా రాణిస్తున్న తోడిశెట్టి రాములు భగవద్గీత-భావార్థ దీపిక, సుందరకాండము, శ్రీ సీతారామ చరితము మున్నగు పద్య కావ్యాలను రచించారు. 2014 నవంబరులో ముద్రితమైన సుందరకాండము పద్య కావ్యము 1521 కంద పద్యాలతో పూర్తిచేశారు.

గుర్తింపులు:
2009లో శ్రీ కొండూరు రాఘవరావు - రాజ్యలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్టుచే "మొల్లమాంబ బంగారు పతకం" స్వీకరించారు.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రచయితలు, 1950లో జన్మించినవారు, నిర్మల్ మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక