తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త అయిన ఆదిరాజు వీరభద్రరావు 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా దెందుకూరు గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించడంతో దూరపు బంధువైన రావిచెట్టు రంగారావు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా నియమితులైనారు.
1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలిలించిన సమయంలో లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళారు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు మరియు పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యారు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, నారాయణ గూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Adiraju Veerabhadra Rao biography in Telugu, Telangana famous persons biography in Telugu,
Nice informative article by this I came to know that we are the relatives of him and we are proud of him
రిప్లయితొలగించండి