16, డిసెంబర్ 2014, మంగళవారం

దిగంబరరావు బిందు (Digambara Rao Bindu)

దిగంబరరావు బిందు
స్వస్థలంభోకర్  (మహారాష్ట్ర)
రంగంవిమోచనోద్యమం
పదవులుహైదరాబాదు రాష్ట్ర హోంశాఖ మంత్రి
దిగంబరరావు బిందు ఇప్పటి మహారాష్ట్రకు చెందిన నాందేడు జిల్లా భోకర్  వాస్తవ్యులు. ప్రారంభంలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేసి, ఆ తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే ప్రజాఉద్యమాలలో పాలుపంచుకున్నారు. 1941లో అప్పటి మహారాష్ట్ర పరిషత్తు అధ్యక్షుడు కాశీనాథరావు వైద్య దిగంబరరావును పరిషత్తు కార్యదర్శిగా నియమించారు. 1941-45 కాలంలో రయ్యత్ పత్రిక మేనేజరుగా పనిచేసిన దిగంబరరావు ఆ తర్వాత రామానందతీర్థ  ఆంతరంగికులుగా ఉంటూ అప్పటి హైదరాబాదు రాజ్య నిజాం అకృత్యాలను ఎదిరిస్తూ స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1950లో నిజామాబాదులో జరిగిన హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు.

1951 శాసనసభ ఎన్నికలలో ఈయన భోకర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో దిగంబరరావు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన సేవలకు గుర్తుగా నాందేడ్ సమీపంలోని భోకర్‌లోని కళాశాలకు దిగంబరరావు బిందూ కళాశాలగా పేరుపెట్టబడింది.

విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, నాందేడు జిల్లా, హైదరాబాదు రాష్ట్ర మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక