27, డిసెంబర్ 2014, శనివారం

వినాయకరావు కొరాట్కర్ (Vinayak Rao Koratkar)

వినాయకరావు కొరాట్కర్
జననంఫిబ్రవరి 3, 1895
రంగంసంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు,
పదవులుహైదరాబాదు రాష్ట్ర మంత్రి, ఎంపి,
మరణంసెప్టెంబరు 3, 1962
ప్రముఖ సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన వినాయకరావు కొరాట్కర్ ఫిబ్రవరి 3, 1895న ఇప్పటి మహారాష్ట్రలోని ఉస్మానాబాదు జిల్లా కళంబ్‌లో జన్మించారు. హరిద్వార మరియు పూనెల నుంచి ఉన్నత విద్య పొంది ఇంగ్లాండులో న్యాయశాస్త్ర్తం అభ్యసించారు. స్వదేశానికి వచ్చిన పిమ్మట హైదరాబాదులో లా ప్రాక్టీసు ప్రారంభించారు. న్యాయవాదిగా ఉంటూనే సంఘసంస్కరణ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఆర్యసమాజ్ మరియు హిందీ ప్రచారసభలకు అధ్యక్షత వహించడమే కాకుండా ఆర్యభాను హిందీ వారపత్రికను కూడా కొంతకాలం నిర్వహించారు. హైదరాబాదులో కేశవ్ మెమోరియల్ స్కూల్ మరియు హిందీ మహావిద్యాలయను ఈయనే స్థాపించారు. 1948లో విమోచనోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం రాజకీయాలలో ప్రవేశించారు. సెప్టెంబరు 3, 1962న వినాయకరావు మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై బూర్గుల రామకృష్ణరావు మంత్రివర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలోని మరఠ్వాడ ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో చేరడంతో 1956లో ఈయన బొంబాయి రాష్ట్ర శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 1957లో మళ్ళీ హైదరాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినారు.

కుటుంబం:
వినాయకరావు తండ్రి కేశవరావు కొరాట్కర్ కూడా సంఘసేవకులు మరియు సమరయోధులు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక విద్యా సంస్కరణలు చేపట్టారు

విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, హైదరాబాదు రాష్ట్ర మంత్రులు, హైదరాబాదు లోకసభ నియోజకవర్గం, ఉస్మానాబాదు జిల్లా, 1895లో జన్మించినవారు, 1962లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక