27, డిసెంబర్ 2014, శనివారం

కె.వి.రంగారెడ్డి (K.V.Ranga Reddy)

కె.వి.రంగారెడ్డి
జననండిసెంబరు 12, 1890
స్వస్థలంపెద్దమంగళారం (రంగారెడ్డి జిల్లా)
రంగంసమరయోధుడు, రాజకీయ నాయకుడు,
పదవులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,
మరణంజూలై 24, 1970
తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాదు మండలం, పెద్దమంగళారం గ్రామంలో డిసెంబరు 12, 1890న జన్మించారు. హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. విమోచన అనంతరం రాజకీయాలలో ప్రవేశించి రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970 జూలై 24న రంగారెడ్డి మరణించారు. ఈయన "ది స్ట్రగుల్ అండ్ ది బిట్రేయల్ - ది తెలంగాణ స్టోరి" పేరుతో ఆత్మకథను రచించారు. ఈయన సేవలకు గుర్తుగా 1978 ఆగస్టులో హైదరాబాదు జిల్లా నుంచి గ్రామీణ ప్రాంతాలను వేరుచేసి ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు రంగారెడ్డి జిల్లాగా పేరుపెట్టబడింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఈయన మేనల్లుడు.

ఉద్యమాలు:
విద్యార్థి దశలోనే రంగారెడ్డి పోరాటయోధునిగా పేరుపొందారు. ఆంధ్ర మహాసభలలో చురుకుగాపాల్గొనడమే కాకుండా 1936లో షాద్‌నగర్‌లో జరిగిన 5వ ఆంధ్ర మహాసభలకు, 1942లో హైదరాబాదులో జరిగిన 10వ మహాసభలకు అధ్యక్షత వహించారు. జవహార్‌లాల్ నెగ్రూ, బల్వంత్‌రాయ్ మెహతాలతో సన్నిహితంగా మెలిగేవారు.

రాజకీయప్రస్థానం:
ఆంధ్రమాహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవనం ఆరంభించిన కొండా వెంకట రంగారెడ్డి 1936లోనే హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నిజాం శాసనసభలో 21 స్థానాలలో 19 స్థానాలను నామినేట్ చేయగా కేవలం 2 స్థానాల నుంచి ఒకటి దక్కించుకున్నారు. హైదరాబాదు విమోచన అనంతరం 1952లో జరిగిన ఎన్నికలలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎక్సైజ్, కస్టమ్స్, అటవీశాఖ మంత్రిగా స్థానం పొందారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పదవి పొందారు. అనంతరం సంజీవయ్య హయంలో ఉప ముఖ్యమంత్రిగా నియమితులైనారు. 1962లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంటు అభ్యర్థి, ప్రముఖ సమరయోధుడైన వందేమాతరం రామచంద్రారావు చేతిలో ఓడిపోయారు.
కొండా వెంకట రంగారెడ్డి జనరల్ నాలెడ్జి

బంధుత్వం:
ఈయనకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమారైలు. సంతానంలో ఎవరినీ రాజకీయాలలో రానీయలేరు. ఈయన మేనల్లుడు మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. ఈయన మనవడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014లో చేవెళ్ళ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.విభాగాలు: రంగారెడ్డి జిల్లా సమరయోధులు, రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు, మొయినాబాదు మండలం, హైదరాబాదు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, 1890లో జన్మించినవారు, 1970లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక