16, మార్చి 2015, సోమవారం

అర్థవీడు మండలం (Arthaveedu Mandal)

జిల్లాప్రకాశం
జనాభా36,155 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంగిద్దలూరు అ/ని,
లోకసభ నియోజకవర్గంఒంగోలు లో/ని,
అర్థవీడు ప్రకాశం జిల్లాకు చెందిన మండలము. 1986కు ముందు గిద్దలూరు తాలుకాలో ఉండేది. కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధిచెందిన కాకర్ల త్యాగయ్య పూర్వీకుల కాకర్ల గ్రామం ఈ మండలంలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు చేగిరెడ్డి బాలిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉండేది. ఈ మండలం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
అర్థవీడు మండలం ప్రకాశం జిల్లాలో పశ్చిమ వైపున కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన డోర్నాల మండలం, తూర్పున మార్కాపురం మండలం, దక్షిణాన గిద్దలూరు, రాచర్ల, కంబం మండలాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36,688. ఇందులో పురుషులు 18,970, మహిళలు 17,718.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 36,155. ఇందులో పురుషులు 18645, మహిళలు 17510.

రాజకీయాలు:
ఈ మండలం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

అర్థవీడు భౌగోళిక స్థానం
రవాణా సౌకర్యాలు:
ఈ మండలం గుండా రైలుమార్గం కాని, జాతీయ రహదారి కాని లేదు. ఈ మండలానికి సరిహద్దుగా ఉన్న గిద్దలూరు, కంబంలలో రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
అయ్యవారిపల్లి • అర్ధవీడు • కాకర్ల • గన్నేపల్లి • దొనకొండ • పాపినేనిపల్లి • పెదకందుకూరు • పొట్టిబసవయ్యపల్లి • బొల్లుపల్లి • బోగోలు • మగుటూరు • యెర్రగుంట్ల (నిర్జన గ్రామము) • వెలగలపాయ



విభాగాలు: ప్రకాశం జిల్లా మండలాలు, అర్థవీడు మండలము,  గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక