8, మార్చి 2015, ఆదివారం

కె.ఎం.మున్షీ (K.M.Munshi)

 కె.ఎం.మున్షీ
జననండిసెంబరు 30, 1887
స్వస్థలంబారుచ్
నిర్వహించిన పదవులుకేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నరు,
మరణంఫిబ్రవరి 8, 1971
స్వాతంత్ర్య సమరయోధునిగా, రాజకీయ నాయకుడిగా, రచయితగా ప్రసిద్ధిచెందిన కన్నయలాల్ మాణిక్‌లాల్ మున్షీ డిసెంబరు 30, 1887న ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్‌లో జన్మించారు. బారుచ్, వడోదరలలో అభ్యసించి జాతీయోద్యమంలో ప్రవేశించారు. 1937లో బొంబాయి రాష్ట్ర మంత్రిగా పదవి నిర్వహించారు. 1948లో భారత ప్రభుత్వం తరఫున హైదరాబాదు రాజ్యానికి దూతగా వచ్చి సమస్యను పరిష్కరించి ప్రఖ్యాతిచెందారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు. సాహితీవేత్తగా రాణిస్తూ భారతీయ విద్యాభవన్‌ను ప్రారంభించారు.  ఫిబ్రవరి 8, 1971న 83 సంవత్సరాల వయస్సులో మున్షీ మరణించారు.

బాల్యం, అభ్యసనం:
హైస్కూల్ విద్యవరకు స్థానికంగా బారుచ్‌లోనే అభ్యసించి ఆ తర్వాత వడోదర (బరోడా) వెళ్ళారు. అక్కడ అరవిందఘోష్ ఆచార్యుడు. ఆయన ప్రభావం మరియు బరోడా పాలకుడు షయాజీరావ్ గైక్వాడ్ ప్రభావం వల్ల మున్షీ జాతీయోధ్యమంలో ప్రవేశించాడు. అంతేకాకుండా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌, భులాభాయ్ దేశాయ్‌లు కూడా ఆ ప్రాంతానికే చెందిన వారు కావడంతో స్వాతంత్ర్యోద్యమంపై బలమైన ముద్రపడింది. అదే సమయంలో రచయితగా, న్యాయవాదిగా కూడా మున్షీ రాణించారు.

రాజకీయ ప్రస్థానం:
1937లోనే అవిభక్త ముంబాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మున్షీ హోంశాఖ మంత్రిపదవిని పొందారు. సంస్థానాల విలీనీకరణ సమయంలో మొండికేసిన హైదరాబాదు నిజాంపై చర్యలు తీసుకోవడానికి భారతప్రభుత్వ దూతగా వచ్చిన మున్షీ సమస్యను చక్కగా పరిష్కరించి ప్రసిద్ధిచెందారు. భారత రాజ్యాంగ రచనలో కూడా భాగస్వాములైనారు. ఆ తర్వాత జవహార్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఆహార్-వ్యవసాయ శాఖ మంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేశారు. చివరిదశలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజగోపాలచారితో కల్సి స్వతంత్రపార్టీని స్థాపించారు.

విభాగాలు: గుజరాత్ రాష్ట్ర రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, 1887లో జన్మించినవారు, 1971లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక