25, మార్చి 2015, బుధవారం

నారపరాజు రామచంద్రారావు (Ramchander Rao Naraparaju)

ఎన్.రామచంద్రారావు
పదవిఎమ్మెల్సీ
ఎన్.రామచంద్రారావు భారతీయ జనతాపార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 27, 1959న హైదరాబాదులో జన్మించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న రామచంద్రారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2015 మార్చిలో తెలంగాణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
విద్యార్థి దశలోనే రామచంద్రారావు నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. డిగ్రీలో ఉన్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు తరఫున కళాశాల అధ్యక్షుడిగా వరసగా 3 సంవత్సరాలు ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసిస్తున్నప్పుడు కళాశాల కార్యదర్శిగా రెండేళ్ళు వ్యవహరించారు.

2009 ఎమ్మెల్సీ ఎన్నికలలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేసి కొద్దితేడాతో ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి తెరాస చేతిలో 2680 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికయ్యారు. 2015 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీచేసి తెరాస అభ్యర్థి దేవీప్రసాద్‌పై ఘనవిజయం సాధించారు.


భారతీయ జనతా ఫార్టీ నాయకులు, తెలంగాణ ఎమ్మెల్సీలు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక