30, ఏప్రిల్ 2015, గురువారం

ఆగ్రా జిల్లా (Agra District)

ఆగ్రా జిల్లా
రాష్టంఉత్తరప్రదేశ్‌
వైశాల్యం4,027 చకిమీ
జనాభా43,80,793 (2011)
పర్యాటక ప్రాంతాలుతాజ్‌మహల్,
ఆగ్రా జిల్లా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 75 జిల్లాలలో ఒకటి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ జిల్లా 4,027 చకిమీ వైశాల్యంతో, 2011 ప్రకారం 43,80,793 జనాభాను కలిగియుంది. తాజ్‌మహల్, ఆగ్రాకోట, సికింద్రా లాంటి పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో కలవు. గంగానదికి ఉపనది అయిన యమునానది జిల్లా గుండా ఆగ్రా నగరం సమీపం నుంచి ప్రవహిస్తోంది. ఆగ్రాలో 6 తహసీళ్ళు మరియు 15 బ్లాకులు కలవు. పారిశ్రామికంగా మరియు పర్యాటకంగా జిల్లా అభివృద్ధిపథంలో ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఆగ్రా జిల్లాకు ఉత్తరాన మధుర జిల్లా, దక్షిణాన రాజస్థాన్, తూర్పున ఫిరోజాబాద్ జిల్లా, మరియు రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమాన రాజస్థాన్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. 27.11' డి ఉత్తర అక్షాంశం, 78.0' - 78.2' డి తూర్పు రేఖాంశంపై ఉంది.

చరిత్ర:ఆగ్రా జిల్లా చారిత్రక ప్రాశస్త్యం కలిగిన జిల్లా. ఇప్పటికీ జిల్లాలో చారిత్రక ప్రాంతాలు సందర్శనకు అనువుగా ఉన్నాయి. మహాభారతంలో ఆగ్రా పేరును అగ్రవనగా పేర్కొనబడింది. అధునిక ఆగ్రా 16వ శతాభ్దిలో సికిందర్ లోఢిచే స్థాపించబడింది. మొఘల్ పాలకుడు అక్బర్‌చే ఆగ్రాకోట మరియు ఫతేపూర్ సిక్రీ, జహంగీర్‌చే తాజ్‌మహల్ నిర్మించబడింది.

జనాభా:
2011 జనాభా లెక్కల ప్రకారం ఆగ్రా జిల్లా జనాభా 43,80,793. దేశంలోని 640 జిల్లాలలో ఇది 41వ స్థానంలో ఉంది. జనసాంద్రత 1084. 2001-11 దశబ్ది కాలంలో జనాభా పెరుగుదల రేటు 21%. స్త్రీ-పురుష నిష్పత్తి 859/1000. అక్షరాస్యత శాతం 69.44%.విభాగాలు: ఉత్తరప్రదేశ్ జిల్లాలు, ఆగ్రా జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక