1, మే 2015, శుక్రవారం

కె.విజయరామారావు (K.Vijaya Rama Rao)

కె.విజయరామారావు
జన్మస్థానంఏటూరు నాగారం
పదవులుహైదరబాదు పోలీస్ కమీషనర్, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర మంత్రి,
రాష్ట్రమంత్రిగా, సీబీఐ డైరెక్టరుగా, హైదరాబాదు పోలీస్ కమీషనర్‌గా పనిచేసిన కె.విజయరామారావు వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో జన్మించారు. హైస్కూల్‌ విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. తాతగారు (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకటగిరిలో చాలా పెద్ద భూస్వామ్య కుటుంబం.

వెంకటగిరిలో విద్యాభ్యాసం అయిపోయాక పైచదువులకు మద్రాసు యూనివర్సిటీలో చేరారు. బి.ఎ.ఆనర్స్‌ పూర్తవగానే 1958 అక్టోబరులో కరీంనగర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. 1959 అక్టోబరు నాటికి ఐపీఎస్‌ ట్రైనీగా శిక్షణ పొంది చిత్తూరు ఏఎస్పీగా చేరారు. 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో ఇతను హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు.మొదలైన కేసులు నిర్వహించారు, తర్వాత పోలీస్‌ మాన్యువల్‌ రాశారు.

పదవీ విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1999లొ ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి దక్కింది. 2004, 2009లలో పోటీచేసి ఓడిపోయారు.

విభాగాలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, హైదరాబాదు పోలీస్ కమీషనర్లు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక