18, ఏప్రిల్ 2015, శనివారం

గూడవల్లి రామబ్రహ్మం (Gudavalli Ramabrahmam)

గూడవల్లి రామబ్రహ్మం
(1902-1946)
రంగంసినిమా దర్శకుడు
స్వస్థలంనందమూరు
సినీ దర్శకుడిగా, జర్నలిస్టుగా, సమరయోధుడిగా పేరుపొందిన గూడవల్లి రామబ్రహ్మం జూన్ 24, 1902న కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు. ప్రారంభంలో పత్రికారంగంలో పనిచేసి  ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించి "సారథి చిత్ర" ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి పలు సాంఘిక చిత్రాలు నిర్మించారు. మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సాంఘిక చిత్రాలు ద్వారా తెలుగు సినీచరిత్రలో నిలిచిపోయారు. అక్టోబరు 1, 1946న గూడవల్లి మరణించారు.

సినీప్రస్థానం:
ప్రారంభంలో ఒక స్టేషనరి దుకాణం నిర్వహించి, నాటకరంగంలో కొన్నాళ్ళు పనిచేసి, పత్రికారంగంలో కూడా కొంతకాలం పనిచేసి చివరికి సినిమారంగంలో ప్రవేశించారు. సారథిచిత్ర చిత్రనిర్మాణ సంస్థాను స్థాపించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీసిన మాలపిల్ల సినిమా ద్వారా పేరుతెచ్చుకున్నారు. హక్కుల నేపథ్యంతో ఆయన తీసిన రైతుల రైతుబిడ్డ చిత్రం మారుమ్రోగింది. ఈయన తీసిన మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్‌గా చేసింది. రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండుసార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
 
 


విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, తెలుగు సినిమా దర్శకులు, 1902లో జన్మించినవారు, 1946లో మరణించినవారు, ఉంగుటూరు మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక