4, ఏప్రిల్ 2015, శనివారం

లూధియానా జిల్లా (Ludhiana district)

 లూధియానా జిల్లా
రాష్ట్రంపంజాబ్
వైశాల్యం3,767 చకిమీ
జనాభా34,87,882
పరిపాలన కేంద్రంలూధియానా
లూధియానా పంజాబ్ రాష్ట్రానికి చెందిన 22 జిల్లాలలో ఒకటి. పంజాబ్ రాష్ట్రంలో పరిశ్రమలకు పేరుగాంచి, ముఖ్యంహా సైకిళ్ళ తయారీకి ప్రసిద్ధి చెందిన లూధియానా నగరం ఈ జిల్లా పరిపాలన కేంద్రము. లూధియానా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. జిల్లా వైశాల్యం 3,767 చకిమీ మరియు 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 34,87,882. ఢిల్లీ నుంచి అమృత్‌సర్ వెళ్ళు గ్రాండ్ ట్రంక్ రోడ్ జిల్లా గుండా వెళుతుంది. జిల్లా ఉత్తర సరిహద్దులో సట్లెజ్ నది ప్రవహిస్తుంది. జిల్లా కేంద్రం లూధియానాలో పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటి ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
లూధియానా జిలా మాళ్వా ప్రాంతంలో భాగంగా ఉంది. ఈ జిల్లా 30°34' - 31°01' ఉత్తర అక్షాంశం మరియు 75°18' - 76°20' తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది. ఉత్తర సరిహద్దు గుండా సట్లెజ్ నది ప్రవహిస్తోంది. జిల్లాకు ఉత్తరాన జలంధర్ జిల్లా, హోషియార్‌పూర్ జిల్లా, తూర్పున రూప్‌నగర జిల్లా, పశ్చిమాన మోగా జిల్లా, దక్షిణాన మరియు ఆగ్నేయాన బర్నాలా జిల్లా, సంగ్రూర్ జిల్లా, పాటియాలా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
ఆధునిక కాలంలో లూధియానా ప్రాంతంను మొఘలులు, సిక్కులు, బ్రిటీష్ వారు పాలించారు. రంజిత్ సింగ్ కాలంలో లూధియనా బ్రిటీష్ కంటోన్మెంట్‌గా పనిచేసింది.

లూధియానా-ఢిల్లీ రహదారి
జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 34,87,882. జనసాంద్రత 275/చకిమీ. దేశంలోని 640 జిల్లాలో ఈ జిల్లా జనాభాలో 87వ స్థానంలో ఉంది. 2011లో జిల్లా జనాభా 30,30,352. 2001-11 దశాబ్దికాలంలో జనాభా 15% వృద్ధిచెందింది. జిల్లా అక్షరాస్యత శాతం 82.5%.

జిల్లా ఆకర్షణలు:
లూధియానాలో మహారాజా రంజిత్ సింగ్ వార్ మ్యూజియం, గురునానక్ స్టేడియం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, టైగర్ సఫారీ ఉన్నాయి.

విభాగాలు: పంజాబ్ జిల్లాలు, లూధియానా జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక