9, ఏప్రిల్ 2015, గురువారం

టి.మధుసూధన్ రెడ్డి (T.Madhusudhan Reddy)

టి.మధుసూధన్ రెడ్డి
జననంజనవరి 14, 1945
స్వస్థలంబోధ్‌
పదవులుజడ్పీ చైర్మెన్, ఎంపి,
మరణంఏప్రిల్ 7, 2015
ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తక్కల మధుసూధన్ రెడ్డి జనవరి 14, 1945న బోధ్‌లో జన్మించారు. మార్కెటింగ్ కమిటి చైర్మెన్‌గా, సమితి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా, లోకసభ సభ్యునిగా పదవులు పొందడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఏప్రిల్ 7, 2015న మధుసూధన్ రెడ్డి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1969లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1978లో మధుసూధన్ రెడ్డి బోధ్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటి చైర్మెన్‌గా పదవి పొందారు. 1981-83 కాలంలో బోధ్ పంచాయతి సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1983-85 కాలంలో ఆదిలాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. 1995లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్టీ పదవి నిర్వహించి, తెరాస ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2004లో తెరాస తరఫున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. పార్టీ ఆదేశాల ప్రకారం రాజీనామాచేసి ఉప ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. 

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, బోధ్ మండలం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గ, ఆదిలాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్లు, 1945లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక