బొబ్బిలి సంస్థానానికి పాలకునిగా పనిచేసిన వేంకట శ్వేతాచలపతి రంగారావు బహదూర్ 1862లో వెంకటగిరిలో జన్మించారు. 1881 నుండి 1921వరకు బొబ్బిలి పాలకునిగా వ్యవహరించారు. వేంకట రంగారావు 1921లో మరణించారు. ఈయన మనమడు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1932 నుండి 1936 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
జీవనం: వేంకట శ్వేతాచలపతి రంగారావు వెంకటగిరి రాజా సర్వజ్ఞ కృష్ణారావు బహదూర్ యొక్క నాలుగవ కుమారుడు. వేంకట రంగారావు తొమ్మిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు బొబ్బిలి రాణీ లక్ష్మీ చెల్లాయమ్మ దత్తత తీసుకున్నది. వేంకట రంగారావుకు 1878లో వివాహమైంది. అయితే ఆమె 1880లో మరణించింది. ఆ తర్వాత వేంకట రంగారావు ఆమె సోదరిని ద్వితీయవివాహం చేసుకున్నాడు. నవంబర్ 30, 1881న మైనారిటీ తీరిన వెంటనే వేంకట రంగారావు బొబ్బిలి సింహాసనాన్ని అధీష్టించాడు. 1883లోఈయన రెండవ భార్య కూడా మరణించగా 1888లో మూడో పెళ్ళి చేసుకున్నారు. పాలనావిధానం: 1881 నుంచి 1921లో మరణించే వరకు అధికారంలో ఉన్న వేంకట రంగారావు పాలనలో బొబ్బిలి రాజ్యంలో అనేక సంస్కరణలు తెచ్చాడు. పేదలకు, మానసిక, శారీరిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచాడు. 1888లో బొబ్బిలిలో ప్రస్తుతమున్న రాజమహల్ ను కట్టించాడు. గుర్తింపులు, సత్కారాలు: 1902లో లండన్లో ఏడవ ఎడ్వర్డు రాజు, మహారాణి అలెగ్జాండ్రాల పట్టాభిషేకంలో మద్రాసు ప్రెసిడెంసీకి ప్రాతినిధ్యం వహించడానికి వేంకట రంగారావు ఎంపికయ్యాడు. 1895లో వేంకట రంగారావు అప్పటి మద్రాసు గవర్నరు వెన్‌లాక్ వేంచేసిన పురప్రజల మధ్యలో జరిగిన ఉత్సవంలో ఊటీలో నైట్ గా సత్కరించబడ్డాడు.
= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
|
20, ఏప్రిల్ 2015, సోమవారం
వేంకట శ్వేతాచలపతి రంగారావు (Venkata Swethachalapathi Rangarao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి