27, మే 2015, బుధవారం

ఇండోర్ (Indore)

రాష్ట్రంమధ్యప్రదేశ్
జనాభా32,76,697 (2011)
ప్రముఖులుప్రకాష్ చంద్ర సేథి,
అహల్యాబాయి హోల్కర్,
ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా పేరుపొందిన ఇండోర్ దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో 9వ స్థానంలో ఉంది. రాష్ట్ర పశ్చిమ భాగంలో ఉన్న ఇండోర్ చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన నగరం. చరిత్రలో హోల్కర్ రాజ్యానికి రాజధానిగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఆర్థిక మరియు వాణిజ్య రాజధానిగా పిలువబడుతోంది. కేంద్ర మంత్రిగా మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాష్ చంద్ర సేథి, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సి.కె.నాయుడు, నరేంద్రహిర్వాణి, హోల్కర్ పాలకులు అహల్యాబాయి హోల్కర్, శివాజీరావ్ హోల్కర్ ఈ నగరానికి చెందినవారు. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా 32,76,697.

భౌగోళికం:
భౌగోళికంగా రాష్ట్ర పశ్చిమ భాగంలో ఉన్న ఇండోర్ నగరం 22.7°ఉత్తర అక్షాంశం, 75.9°తూర్పు రేఖాంశంపై ఉంది. ఇది మాళా పీఠభూమి దక్షిణకొనపై ఉంది సముద్ర మట్టానికి సుమారు 550 మీటర్ల ఎత్తున ఉన్న ప్రాంతంపై శిప్రా నది ఉపనదులైన సరస్వతి మరియు ఖాన్ నదుల సమీపంలో ఈ నగరం నెలకొని ఉంది.

శివాజీరావ్ హోల్కర్
చరిత్ర:
ఇండోర్ నగరానికి 18వ శతాబ్ది ఆరంభంలో బీజాలు పడ్డాయి. కొంతకాలానికి పరగణా ఏర్పడింది. మరాఠా పీష్వా బాజీరావుకు చౌత్ వసూలు అధికారం లభించింది. 1733లో మల్హర్‌రావ్ హోల్కర్ సుబేదారుగా నియమించడం జరిగింది. ఇతనే హోల్కర్ రాజ్యానికి స్థాపకుడు. 1767లో అహల్యాబాయి హోల్కర్ మహేశ్వర్‌కు రాజధానిగా మార్చేవరకు ఇండోర్ హోల్కర్ రాజ్య రాజధానిగా పనిచేసింది. 1818లో మూడో మరాఠా యుద్ధంలో బ్రిటీష్ వారు విజయం సాధించిన పిదప ఈ ప్రాంతం బ్రిటీష్ వారి పాలనలోకి వచ్చింది. స్వాతంత్ర్యానంతరం 1948లో మధ్యభారత్ రాష్ట్రంలోనూ 1956లో మధ్యప్రదేశ్ అవతరణతో కొత్త రాష్ట్రంలో చేరి కొనసాగుతోంది.

క్రీడలు:
క్రికెట్ ఇక్కడి జనాదరణ కలిగిన క్రీడ. భారతదేశపు తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ సి.కనకయ్య నాయుడు, రాహుల్ ద్రవిడ్, నరేంద్రహిర్వాణీలు ఈ నగరానికి చెందినవారు. ఇక్కడ అంతరాతీయ క్రికెట్ పోటీలు నిర్వహించే హోల్కర్ స్టేడియం కూడా ఉంది.


విభాగాలు: మధ్యప్రదేశ్ నగరాలు, భారతదేశ నగరాలు, ఇండోర్, హోల్కర్ రాజ్యం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక