8, మే 2015, శుక్రవారం

ఐరాల మండలం (Irala Mandal)

జిల్లాచిత్తూరు జిల్లా
జనాభా52730 (2011),
అసెంబ్లీ నియో.పూతలపట్టు అ/ని,
లోకసభ నియో.చిత్తూరు లో/ని,
పిన్‌కోడ్517130
ఎస్టీడి కోడ్08573
ఐరాల చిత్తూరు జిల్లాకు చెందిన మండలము. ప్రసిద్ధి చెందిన కాణిపాకం క్షేత్రం మండలంలో ఉంది. ఈ మండలము పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52730. ఐరాల, ముదిగోలం, నాంపల్లి మండలంలోని పెద్ద గ్రామాలు.

భౌగోళికం, సరిహద్దులు:
చిత్తూరు జిల్లాలో ఐరాల మండలం సుమారుగా మధ్యలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన సోమల మండలం, ఉత్తరాన పాకాల మండలం, తూర్పున పూతలపట్టు మండలం, దక్షిణాన తవణంపల్లె మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలకేంద్రం 13°24′16″ ఉత్తర అక్షాంశం, 78°57′31″ తూర్పు రేఖాంశంపై ఉంది.

చరిత్ర:
ఈ ప్రాంతం స్వాతంత్ర్యానికి ముందు మద్రాసు ప్రావిన్సులో ఉండగా 1947-53 కాలంలో మద్రాసు రాష్ట్రంలో కొనసాగి 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రంలో, 1956 నవంబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48891. ఇందులో పురుషులు 24640, మహిళలు 24251. గృహాల సంఖ్య 11632.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52730. ఇందులో పురుషులు 25312, మహిళలు 27418. స్త్రీపురుష నిష్పత్తి (1083/వెయ్యి పురుషులకు)లో ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.

కాణిపాకం ఆలయం
రాజకీయాలు:
ఈ మండలము పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండల విశిష్టతలు:
 • ప్రసిద్ధి చెందిన కాణిపాకం క్షేత్రం మండలంలో ఉంది.
 • 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీపురుష నిష్పత్తిలో ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది.
మండలంలోని గ్రామాలు:
అయ్యల కృష్ణారెడ్డిపల్లె • ఎర్లంపల్లె • ఐరాల • కాణిపాకం • కామినాయనిపల్లె • కొత్తపల్లె • కొల్లపల్లె • గుండ్లపల్లె • గూబలవారిపల్లె • చిగరపల్లె • చుక్కావారిపల్లె • తిరుమలయ్యగారిపల్లె • దిగువనాగులవారిపల్లె • నాంపల్లె • పుత్రమద్ది • పుల్లూరు • పెద్దసామిరెడ్డిపల్లె • పేరయ్యగారి పల్లి • పొలకల • ముదిగొళం • మొరంపల్లె • వెంకట సముద్ర అగ్రహారం • సంగనపల్లె

విభాగాలు: చిత్తూరు జిల్లా మండలాలు, ఐరాల మండలం, పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక