2, మే 2015, శనివారం

ఖాట్మండ్ (Kathmandu)

దేశంనేపాల్
జనాభా10,03,285 (2011),
వైశాల్యం 50 చకిమీ
ఖాట్మండ్ నేపాల్‌కు చెందిన పెద్ద నగరము మరియు రాజధాని నగరం. నేపాల్‌లో ఇది ఏకైక మెట్రోపాలిటన్ నగరం. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా 10,03,285, వైశాల్యం సుమారు 50 చకిమీ. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ నగరం పర్యాటకానికి ప్రసిద్ధి. ఖాట్మండ్ నగరనికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీన శాసనాలు కూడా ఖాట్మండ్ లోయలో లభించాయి. నగరంలో అత్యధికులు నేపాలీ భాష మాట్లాడుతారు. ఏప్రిల్ 25, 2015న సంభవించిన భారీ భూకంపం వల్ల ఈ నగరం తీవ్రనష్టానికి గురైంది.

భౌగోళికం:
ఖాట్మండ్ నగరం ఖాట్మండ్ లోయకు వాయువ్యాన బాగ్‌మతి నది తీరాన ఉంది. నగర వైశాల్యం సుమారు 50 చకిమీ. లలిత్‌పూర్, భక్తాపూర్‌లతో కలిసి ఇది ట్రైసిటీస్ గా పరిగణించబడుతుంది. హిమాలయ పర్వతాలలో సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉండుట వల్ల నగర వాతావరణం చల్లగా ఉంటుంది.

ఆర్థికం:
పర్యాటకానికి పేరుపొందిన ఖాట్మండ్ నగరం నేపాల్‌లో అతిపెద్ద వాణిజ్యకేంద్రం. జాతీయ బ్యాంకు, నేపాల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు నగరంలో ఉన్నాయి. లోక్తా పేపరుకు, పశ్మీనా శాలువాలకు నగరం ప్రసిద్ధిచెందింది.
అద్యక్షభవనం - శీతల్ నివాస్

పర్యాటకం:
ప్రసిద్ధి చెందిన పశుపతినాథ్ ఆలయం, బౌధనాథ్, స్వయంభునాథ్ నగరంలో పర్యాటకానికి పేరుగాంచాయి. ఎత్తయిన దరహర స్తూపం ఏప్రిల్ 2015 భూపంకంలో నేలమట్టం అయింది. దీనితో పాటు పలు కళాకేంద్రాలు, మ్యూజియంలు కలవు.

క్రీడలు:
ఖాట్మండ్ యొక్క ప్రధాన క్రీడ ఫుట్‌బాల్. దేశంలోని ఏకైక అంతర్జాతీయ స్థాయి స్టేడియం దశరథ్ రంగశాల స్టేడీయం నగరంలో ఉంది.


విభాగాలు: నేపాల్, ప్రపంచ రాజధాని నగరాలు, ఆసియా నగరాలు, ఖాట్మండ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక