15, మే 2015, శుక్రవారం

మేఘనాథ్ సాహా (Meghnad Saha)

జననంఅక్టోబర్ 6, 1893
రంగంఖగోళ భౌతిక శాస్త్రవేత్త
మరణంఫిబ్రవరి 16, 1956
ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పేరుపొందిన మేఘనాథ్ సాహ అక్టోబర్ 6, 1893న ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఢాకా సమీపంలో జన్మించాడు. 1923 లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యాడు. 1927 లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1934లో 21వ భారత సైన్సు కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహించాడు. 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ కలకత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. సాహ ఫిబ్రవరి 16, 1956న మరణించాడు.

పరిశోధనలు:
సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా ప్రసరించినప్పుడు ఏర్పడే వర్ణపటం (Spectrum) ఏర్పడుటకు కారణం వివరిస్తూ అయనీకరణ సూత్రాన్ని ప్రతిపాదించాడు. అలహాబాదు యూనివర్శిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉంటూ వర్ణపట విజ్ఞానం (Spectroscopy), ఐనో ఆవరణం (Ionosphere)పై పరిశోధనలు చేశారు. సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు.  దేశంలో పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్‌ ఆయన పర్యవేక్షణలోనే నిర్మితమైంది. నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.

విభాగాలు: భారతదేశ శాస్త్రవేత్తలు, ఖగోళ భౌతిక శాస్తవేత్తలు, రాయల్ సొసైటి సభ్యత్వం పొందినవారు, 1893లో జన్మించినవారు, 1956లో మరణించినవారు, ఢాకా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక