3, మే 2015, ఆదివారం

పెదపారుపూడి మండలం (Pedaparupuudi Mandal)

జిల్లాకృష్ణా జిల్లా
జనాభా31338 (2011),
రెవెన్యూ డివిజన్గుడివాడ
పిన్‌కోడ్521 263
పెదపారుమూడి కృష్ణా జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం గుడివాడ రెవెన్యూ డివిజన్, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. స్వాతంత్ర్య సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు, 2013 జూన్‌లో కేంద్ర మంత్రిగా నియమితులైన కావూరి సాంబశివరావు, తెలుగు సినీనటుడు శ్రీహరి, సినీనిర్మాత వడ్డే రమేష్  ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా పెదపారుపూడి మండలం కృష్ణా జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున గుడివాడ మండలం, దక్షిణాన పామర్రు మండలం, పశ్చిమాన పెనమలూరు మండలం, వాయువ్యాన ఉంగుటూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 33099, ఇందులో పురుషులు 16531, మహిళలు 16568.
2011 లెక్కల ప్రకారము మండల జనాభా 31338. ఇందులో పురుషులు 15476, మహిళలు 15862.

పెదపారుపూడి స్థానం
రాజకీయాలు:
ఈ మండలం పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2013లో మన్‌మోహన్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందిన కావూరి సాంబశివరవు ఈ మండలమునకు చెందినవారు.

మండలంలోని గ్రామాలు:
అప్పికట్ల · ఎలమర్రు · ఏదులమద్దాలి · కొర్నిపాడు · గురువిందగుంట · చినపారుపూడి · జమిడింటకూరు · జువ్వనపూడి · దోసపాడు · పాములపాడు · పెదపారుపూడి · భూషనగుల్ల · మహేశ్వరం · మొపర్రు · రవులపాడు · వానపాముల · వింజరంపాడు · వెంట్రప్రగడ · సోమవరప్పాడు

విభాగాలు: కృష్ణా జిల్లా మండలాలు, పెదపరుపూడి మండలం, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక