20, మే 2015, బుధవారం

యర్రగుంట్ల మండలం (Yarraguntla Mandal)

జిల్లాకడప జిల్లా
జనాభా65254 (2001),
77190 (2011),
అసెంబ్లీ నియో.జమ్ములమడుగు అ/ని,
లోకసభ నియో.కడప లో/ని,
యర్రగుంట్ల కడప జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము జమ్ములమడుగు అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. క్రీ.శ.6వ శతాబ్ది నాటి తొలి తెలుగు శాసనం కలమల్ల గ్రామంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77190. గుంతకల్ నుంచి రేణిగుంట వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండలంలో సిమెంట్ కర్మాగారాలు కలవు. ఇక్కడ నాపరాయి విస్తారంగా లభిస్తుంది. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎం.వి.మైసూరారెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యమున ప్రొద్దుటూరు మండలం, తూర్పున కమలాపూర్ మండలం, దక్షిణమున వీరపునాయునిపల్లి మండలం, పశ్చిమాన మద్దునూరు మండలం, వాయువ్యాన జమ్మలమడుగు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 65254. ఇందులో పురుషులు 32932, మహిళలు 32322. గృహాల సంఖ్య 15263.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77190. ఇందులో పురుషులు 39099, మహిళలు 38091. పట్టణ జనాభా 32572, గ్రామీణ జనాభా 44618.

ఎం.వి.మైసూరారెడ్డి
రాజకీయాలు:
ఈ మండలము జమ్ములమడుగు అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎం.వి.మైసూరారెడ్డి మండలంలోని నిడిజువ్వి గ్రామానికి చెందినవారు.

రవాణా సౌకర్యాలు:
గుంతకల్ నుంచి రేణిగుంట వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. అనంతపురం నుంచి కడప వెళ్ళూ రహదారి కూడా మండలం మీదుగా పోవుచున్నది.

మండలంలోని గ్రామాలు:
ఇల్లూరు, కత్తుగుటవెంగన్నగారిపల్లె, కలమల్ల, కోడూరు, చిన్నదండ్లూరు, చిలమకూరు, టీ.సుంకేసుల, తిప్పలూరు, నిడిజువ్వి, పి.గోపాలపురం, పెద్దనపాడు, పొట్లదుర్తి, మాలెపాడు, వలసపల్లె, సున్నపురాళ్లపల్లి, హనుమానగుత్తి,

విభాగాలు: కడప జిల్లాకు చెందిన మండలాలు, యర్రగుంట్ల మండలం, కడప లోకసభ నియోజకవర్గం, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక