బాగల్‌కోట్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తరం వైపున ఉన్న ఈ జిల్లా 16.12° ఉత్తర అక్షాంశం 75.45°తూర్పు రేఖాంశంపై ఉంది. బాగల్‌కోట్ మరియు బాదామి ప్రాంతాలు చాళుక్యుల రాజధానులుగా పనిచేశాయి. యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పట్టడకల్ ఈ జిల్లాలోనే ఉంది. జిల్లా గుండా కృష్ణానది, ఘటప్రభ, మలప్రభ నదులు ప్రవహిస్తున్నాయి. 12వ శతాబ్దికి చెందిన బసవేశ్వరుడు ఈ జిల్లాలోనే జన్మించాడు. జిల్లా విస్తీర్ణం 6593 చకిమీ. జిల్లాలో 6 తాలుకాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 18,90,826.
భౌగోళికం, సరిహద్దులు: ఉత్తర కర్ణాటకలో భాగంగా ఉన్న ఈ జిల్లాకు ఉత్తరాన మరియు ఈశాన్యాన బీజాపుర్ జిల్లా, తూర్పున రాయచూర్ జిల్లా, దక్షిణాన కొప్పల్ మరియు గదక్ జిల్లాలు, పశ్చిమాన బెల్గాం (బెళగావి) జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా గుండా కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదులు ప్రవహిస్తున్నాయి. కూడలిసంగమం వద్ద మలప్రభ నది కృష్ణాలో సంగమిస్తుంది. జిల్లా విస్తీర్ణం 6593 చకిమీ. చరిత్ర: చారిత్రకంగా బాగల్‌కోట్ మొదటి పులకేశి కాలంలో చాళుక్యుల రాజధానిగా ఉండేది. ఆ తర్వాత రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చేవరకు బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి పట్టణం చాలా కాలం పాటు రాజధానిగా వర్థిల్లింది. తర్వాత నవాబులు, పీష్వాలు పాలించారు. ఆంగ్లేయుల కాలంలో ఇది బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1947లో స్వాతంత్ర్యం లభించినపిదప మైసూరు రాష్ట్రంలోనూ, 1971లో రాష్ట్ర పేరుమార్పు అనంతరం కర్ణాటకలోనూ కొనసాగుతోంది. 1997లో బీజాపూర్ జిల్లా నుంచి విభజించి ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 18,90,826. దేశంలోని 640 జిల్లాలలో ఇది 249వ స్థానంలో, కర్ణాటకలో 15వ స్థానంలో ఉంది. జనఆంద్రత 288. 2001-11 కాలంలో జనాభా 14.46% వృద్ధి చెందింది. స్త్రీ-పురుష నిష్పత్తి 984/1000. అక్షరాస్యత శాతం 69.39%. పర్యాటక ప్రాంతాలు: జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు కలవు. చాళుక్యుల రాజధానిగా పనిచేసిన బాదామిలో గుహాలయాలు, యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం పొందిన పట్టడకల్‌లో ప్రాచీన దేవాలయాలు, ఐహోల్‌లో వందలాది దేవాలయాలు ఉన్నాయి. బసవేశ్వరుడు జన్మించిన కూడలి కృష్ణా, మలప్రభ సంగమస్థానం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
= = = = =
|
13, జూన్ 2015, శనివారం
బాగల్‌కోట్ జిల్లా (Bagalkot District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి