8, జులై 2015, బుధవారం

భాట్టం శ్రీరామమూర్తి (Bhattam Srirama Murthy)

భాట్టం శ్రీరామమూర్తి
జననంమే 12, 1928
రంగంసమరయోధుడు, రాజకీయాలు, జర్నలిజం,
పదవులురాష్ట్ర మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ,
మరణంజూలై 6, 2015
స్వాతంత్ర్య సమరయోధుడు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన భాట్టం శ్రీరామమూర్తి మే 12, 1928న విశాఖపట్టణం జిల్లా ధర్మవరంలో జన్మించారు. జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన శ్రీరామమూర్తి రచయితగా పలు పుస్తకాలు కూడా రచించారు. స్వేచ్ఛాభారతం పేరుతో స్వీయచరిత్రను రచించుకున్నారు. జర్నలిస్టుగా పేరుపొంది జయభారత్, ప్రజారథం, ఆంధ్రజనతా పత్రికలకు సంపాదకత్వం వహించారు. 87 సంవత్సరాల వయస్సులో జూలై 6, 2015న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1955లో భారత సోషలిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీరామమూర్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1957, 1962లలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1972, 1978లలో పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1984లో విజయనగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు.

విభాగాలు: విశాఖపట్టణం జిల్లా రాజకీయ నాయకులు, కొయ్యూరు మండలం, రాష్ట్ర మంత్రులు, విజయనగరం లోకసభ నియోజకవర్గం, 1928లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక