1, జులై 2015, బుధవారం

మోటూరి హనమంతరావు (Moturi Hanmantha Rao)

మోటూరి హనమంతరావు
(1917-2001)
రంగంస్వాతంత్ర్యోద్యమం, రాజకీయాలు
నిర్వహించిన పదవులుఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా పేరుపొందిన మోటూరు హనుమంతరావు 1917లో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో జన్మించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న హన్మంతరావు విశాలాంధ్ర, ప్రజాశక్తి వార్తాపత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. పలు పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడుగానూ ఎన్నికయ్యారు. జూన్ 18, 2001న హనమంతరావు మరణించారు. ఆయన స్వగ్రామం వెల్లటూరులో పదవ వర్థంతి రోజున 2011లో ఆయన కాంస్యవిగ్రహం ఆవిష్కరించారు.

రాజకీయ ప్రస్థానం:
మోటూరి హనమంతరావు 1948లో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనభకు పోటీచేసి, అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళి పై విజయం సాధించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శాసనసభలో ఉపనాయకుడిగా వ్యవహరించారు. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై 1984వరకు పదవి నిర్వహించారు. 1988-1994 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు.

రచనలు:
హనమంతరావు మార్క్సిస్టు సాహిత్యోద్యమం, ఆంధ్రప్రజలలో కమ్యూనిస్టులు అనే గ్రంథాలను వెలువరించారు.

విభాగాలు: గుంటూరు జిల్లా స్వాతంత్ర్యోద్యమ నాయకులు, గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, భట్టిప్రోలు మండలం, 1917లో జన్మించినవారు, 2001లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక