23, మార్చి 2016, బుధవారం

ఎం.ఎల్.నరసింహారావు (M.L.Narasimha Rao)

ఎం.ఎల్.నరసింహారావు
జననంనవంబరు 7, 1928
స్వస్థలంపండితాపురం
రంగంరచయిత, సమరయోధుడు,
మరణంఫిబ్రవరి 12, 2016
ఎమ్మెల్‌గా ప్రసిద్ధి చెందిన మాదిరాజు లక్ష్మీ నరసింహరావు ఇప్పటి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో నవంబరు 7,1928న జన్మించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణలో తొలి గ్రంథాలయం శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో సుమారు 50 సం.లు కార్యదర్శిగా సేవలందించారు. ఫిబ్రవరి 12, 2016న హైదరాబాదులోమరణించారు.

రచయితగా:
ఎమ్మెల్ జీవిత చరిత్రల రచయితగా పేరుపొందారు. మహాత్మాగాంధీ, వినోబాభావే, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, ఇందిరాగాంధీ, పి.వి.నరసింహారావు, మురార్జీదేశాయ్, రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, పండిత్ నరేంద్రజీ లాంటివారి జీవిత చరిత్రలను 35కుపైగా రచించారు.

గుర్తింపులు:
ఎమ్మెల్‌కు 1984లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు , 1993లో అయ్య్యంకి వెంకటరమణయ్య అవార్డు లభించింది. 2005లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. నిజాం వ్యతిరేక పోరాటంలో సమరయోధుడిగా పేరుపొంది కేంద్రంచే తామ్రపత్రం పొందారు.
.

విభాగాలు: ఖమ్మం జిల్లా ప్రముఖులు, ఖమ్మం జిల్లా సమరయోధులు, 1928లో జన్మించినవారు, 2016లో మరణించినవారు, తెలంగాణ రచయితలు, కామేపల్లి మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక