జూలపల్లి పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. 1975లో వడ్కాపూర్ శివారులో అతిప్రాచీనమైన బౌద్ధస్తూపం బయటపడింది. 2 సార్లు శాసనసభకు ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 8 గ్రామపంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాలు కలవు. 2016లో జిల్లాల పునర్వూవస్థీకరణకు పూర్వం ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. 2016లో పునర్విభజన సమయంలో మండలంలో కొత్తగా ధర్మారం మండలం నుంచి అబ్బారం గ్రామం వచ్చిచేరింది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున పెద్దపల్లి మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన సుల్తానాబాద్ మండలం, పశ్చిమాన చొప్పదండి మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన ధర్మారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 27668. ఇందులో పురుషులు 13686, మహిళలు 13982. రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని గ్రామాలు: జూలపల్లి (Julapalli), కుమ్మరికుంట (Kummarikunta), కాచాపుర్ (Kachapur), వడ్కాపుర్ (Vadkapur), పెద్దాపూర్ (Peddapur), తేలుకుంట (Telukunta), అబ్బాపుర్ (Abbapur), అబ్బాపూర్ (Abbapur): అబ్బాపుర్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలమునకు చెందిన గ్రామము. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం ధర్మారం మండలంలో ఉండేది. అక్టోబరు 11, 2016న ప్రభుత్వ ఉత్తర్వు GOMs No 227 ప్రకారం ఈ గ్రామం జూలపల్లి మండలంలో చేరింది. కుమ్మరికుంట (Kummarikunta): కుమ్మరికుంట పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయనాయకుడు కొప్పుల ఈశ్వర్ ఈ గ్రామానికి చెందినవారు. కాచాపూర్ (Kachapur): కాచాపూర్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆకుల భూమయ్య ఈ గ్రామానికి చెందినవారు. వడ్కాపూర్ (Vadkapur): వడ్కాపూర్ (వడకాపురం) పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలమునకు చెందిన గ్రామము. 1975లో గ్రామ శివారులో హీనాయాన శాఖకు చెందిన అతిప్రాచీనమైన బౌద్ధస్తూపం బయటపడింది. అమరావతి కంటే ప్రాచీనమైన నిర్మాణంగా గీన్ని చరిత్రకారులు గుర్తించారు. ఇక్కడికి బుద్ధుడు సైతం వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. స్తూపంపై ఉన్న సున్నపురాతి ఫలకాలపై ఐదు పడగల ముచిలింద నాగు, బోధివృక్షం చెక్కి ఉన్నాయి.
= = = = =
|
Tags: Julapally Mandal in Telugu, Peddapally District Mandals information, Telangana Mandals infirmation, Julapally mandal information in Telugu,
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి