28, ఏప్రిల్ 2020, మంగళవారం

ధర్మారం మండలం (Dharmaram Mandal)

ధర్మారం మండలం
జిల్లా పెద్దపల్లి జిల్లా
రెవెన్యూ డివిజన్ పెద్దపల్లి
అసెంబ్లీ నియోజకవర్గంధర్మపురి
లోకసభ నియోజకవర్గంపెద్దపల్లి
ధర్మారం పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొట్టమొదటి ఎత్తిపోతలను ఈ మండలంలోని నందిమేడారంలో ప్రారంభించారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం పెద్దపల్లి జిల్లాలో అతి పశ్చిమాన జగిత్యాల జిల్లా మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. మండలానికి ఈశాన్యాన పాలకుర్తి మండలం, తూర్పున పాలకుర్తి మరియు పెద్దపల్లి మండలం, దక్షిణాన జూలపల్లి మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన జగిత్యాల జిల్లా, నైరుతిన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పుస్కూరు పద్మజ ఎన్నికయ్యారు.

రవాణా సౌకర్యాలు:
ధర్మపురి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. మెట్‌పల్లి నుంచి పెద్దపల్లి వెళ్లు రహదారి కూడా మండలం మీదుగా పోవుచున్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53404. ఇందులో పురుషులు 26732, మహిళలు 26672.



ధర్మారం మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bommareddipalli, Botlavanaparthy, Chamanpalli, Dongathurthy, Kammarikhanpeta, Katkanpalli, Khanampalli, Khilavanaparthy, Kothur, Mallapur, Myadaram, Narsingapur, Paidichinthalapalli, Pathipaka, Rachapalli, Sayampeta

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

కమ్మర్ ఖాన్ పేట (Kammarkhanpet):
కమ్మర్ ఖాన్ పేట పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలమునకు చెందిన గ్రామము. 1999లో భాజపా తరఫున పెద్దపల్లి నుంచి శాసనసభకు ఎన్నికైన గుజ్జుల రామకృష్ణారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
నందిమేడారం (Nandimedaram):
నందిమేడారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన గ్రామము. గ్రామంలో ప్రాచీనమైన నందికేశ్వరుని భారీ విగ్రహం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎత్తిపోతలలో మొట్టమొదటి ఎత్తిపోతలను నందిమేడారం అండర్ టెన్నెల్‌లో ఏప్రిల్ 24, 2019న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 


ఇవి కూడా చూడండి:
  • పెద్దపల్లి జిల్లా,
  • నందిమేడారం ఎత్తిపోతల,
  • కాళేశ్వరం ప్రాజెక్టు,


ఫోటో గ్యాలరీ

అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్
జిల్లాలో ధర్మారం మండలం స్థానం

నందిమేడారం వద్ద ఎత్తిపోతల
పంప్‌హౌస్
c c


హోం
విభాగాలు: పెద్దపల్లి జిల్లా మండలాలు,  ధర్మారం మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 227 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://peddapalle.telangana.gov.in/ (Official Website of Peddapalli Dist),


Dharmaram Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక